సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కలిసి ఓ సినిమాకి పని చేస్తున్నారు. అసలు వీరిద్దరూ కలిశారనే విషయమే ఆసక్తికరం. ఇక ఆ సినిమా ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో.. సింగీతంతో కలిసి ఓ స్క్రిప్ట్ పై చర్చించాడట తరుణ్ భాస్కర్. ఆ కథను వీరిద్దరూ కలిసి రాశారట. ఆ స్టోరీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తరుణ్ భాస్కర్ వెల్లడించారు.
సింగీతం శ్రీనివాసరావు ఆల్రెడీ ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాకి వర్క్ చేస్తున్నారు. నాగశ్విన్ దర్శకత్వంలో సైన్స్-ఫిక్షన్ ఫాంటసీ సబ్జెక్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కోసం సింగీతం సలహాలు తీసుకుంటున్నారు. ఆ సినిమాతో పాటు ఇప్పుడు తరుణ్ భాస్కర్ తో కలిసి మరో కథ కూడా రాశారట ఈ సీనియర్ డైరెక్టర్. సింగీతం పేరు చెప్పగానే ప్రయోగాత్మక సినిమాలు గుర్తొస్తాయి. అలాంటి దర్శకుడితో కలిసి రాసిన తాజాగా స్క్రిప్ట్ కూడా చాలా కొత్తగా ఉందని చెబుతున్నారు తరుణ్ భాస్కర్.
ఇందులో నటించే హీరో, హీరోయిన్లు, పని చేయబోయే టెక్నీషియన్లు ఎవరనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ క్రైమ్ కామెడీ సినిమా చేయబోతున్నారు. మరికొద్దిరోజుల్లో ఈ సినిమా మొదలుకానుంది. మరోపక్క ‘ఓరగల్లు’ అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నారు.
ఇక వెంకటేష్ తో చేయాల్సిన సినిమా కచ్చితంగా వచ్చే ఏడాది ఉంటుందని అంటున్నారు తరుణ్ భాస్కర్. వీటన్నింతో పాటు ‘ఈ నగరానికి ఏమైంది’ పార్ట్ 2 కూడా ఉంటుందని చెప్పారు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో!
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!