Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

పాన్‌ ఇండియా మోజులో మన సినిమాల్లో అసలు విషయం కంటే ఎలివేషన్లు ఎక్కువవుతున్నాయి అనే అపవాదు గత కొన్ని రోజుల నుండి ఈ వాదన వినిపిస్తూనే ఉంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా.. పాన్‌ ఇండియా అంటూ తమ సినిమాను హైలైట్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు హీరోలు – దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో సినిమాకు ఆ స్థాయి ఉందా లేదా? అసలు ఆ కథ పాన్‌ ఇండియాను అట్రాక్ట్‌ చేసేదేనా అనే విషయం మరచిపోతున్నారు. ఇప్పుడు ఇదే విషయమై లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు స్పందించారు.

Singeetham Srinivas Rao

సుమారు 10 ఏళ్ల తర్వాత కొత్త సినిమా (సింగ్‌ – గీతం)తో వచ్చారు 94 ఏళ్ల లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. వర్క్ ఫ్రమ్‌ హోం కాన్సెప్ట్‌లో ఇంట్లో ఉండే షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి.. విడుదల చేసిన సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో సినిమాల్లోని ఎలివేషన్‌ సీన్ల గురించి కూడా ఉంది. సినిమాల్లో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ సినిమాలోని సహజత్వం గురించి కూడా స్పందించారు.

రాను రాను సినిమాల్లో సినిమాల్లో సాంకేతికత ఆధారంగా తీసుకొచ్చిన అద్భుతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఎక్కువగా హీరో లివేషన్లు, భారీ పాత్రల చుట్టూనే ఆ కథలు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి సహజత్వం ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పారు. మరి ఈ మధ్య మిమ్మల్ని ఆకట్టుకున్న సినిమాలు ఏవీ అంటే.. ‘పుష్ప 2’, ‘కాంతార’ అని చెప్పారు. ‘పుష్ప 2’ సినిమాలో పాత్రల చిత్రణ, ‘కాంతార’ సినిమాలోని భావోద్వేగాలు, పాత్రల రూపకల్పన, కథనం బలంగా ఉన్నాయి అని చెప్పారు సింగీతం..

రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus