Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

తెలుగులో ఎన్ని కాన్సెప్ట్‌ బేస్డ్‌ మూవీస్‌ వచ్చినా.. మలయాళంలో వచ్చే ఈ తరహా సినిమాలకు మన దగ్గర మంచి ఆదరణ దక్కుతూ ఉంటుంది. ఎందుకో కానీ మాలీవుడ్‌ సినిమాలకు ముఖ్యంగా అక్కడ తీసే కాన్సెప్ట్ బేస్డ్‌ సినిమాలకు మన దగ్గర ఫ్యాన్‌ బేస్‌ ఎక్కువే. అలాంటి ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌. మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఓ కాన్సెప్ట్‌ బేస్డ్‌ సినిమాను అనౌన్స్‌ చేశాడు. ఈ సినిమాకు బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Odiyan

‘భ్రమయుగం’, ‘డీయస్‌ ఈరే’ లాంటి హారర్‌ జానర్‌ సినిమాలతో వరుస విజయాలను అందుకున్న మలయాళ దర్శకుడు రాహుల్‌ సదాశివన్‌ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సినిమా పేరు ‘ఒడియన్‌’ – ది ఏజ్‌ ఆఫ్‌ ఇల్యూజన్‌. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో మలయాళ పృథ్వీరాజ్‌ సుకుమారన్, మంజు వారియర్‌ ప్రధాన పాత్రధారులు. జానపద కథల ఆధారంగా భయానకమైన కథనాన్ని చెప్పడంలో దిట్ట అయిన రాహుల్‌ ఈ సినిమాను రూపొందిస్తారని చెప్పుకొచ్చారు.

మలయాళ పురాణాల్లోని రూపాన్ని మార్చుకునే ఓ జీవి ఉంటుంది. ఆ జీవి గురించే ఈ సినిమా అని చెబుతున్నారు. శక్తిమంతమైన కుటుంబం, భ్రమల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని కేరళం టాక్‌. ఇప్పటివరకు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇటీవల కాలంలో చాలా ప్రయోగాలు చేసినా ఇలాంటి హారర్‌ సినిమాలు చేసింది లేదు. ఇప్పుడు ఈ జోనర్‌లోనూ తన టాలెంట్‌ని చూపించబోతున్నారు.

అన్నట్లు ఆ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ చూశారా.. విచిత్రంగా ఉంది కదూ. ఈ పోస్టర్‌లో రూపాన్ని మార్చుకునే జీవిని చూపించాం అంటున్నారు కానీ.. మనిషిలో ఆలోచనల మార్పును సూచించేలా ఈ పోస్టర్‌ పెట్టారని. కథ అంతా మలయాళ సినిమాలో స్టార్‌ కాన్సెప్ట్ ‘ఈగో’ చుట్టూ నడుస్తుందని సమాచారం.

రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus