Chinmayi: డబ్బులు ఇస్తా నాతో ఉంటావా అన్న నెటిజన్… చిన్మయి రియాక్షన్ ఇదే?

  • October 3, 2023 / 04:49 PM IST

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చిన్మయి ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఈమె సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో ఫేమస్ అయ్యారని చెప్పాలి. ఈమె డబ్బింగ్ ద్వారా సమంత సినిమాలు ఎలా సక్సెస్ అయ్యాయో మనకు తెలిసిందే. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి చిన్మయి ఈ మధ్యకాలంలో మహిళలకు చాలా మద్దతుగా నిలబడుతూ వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి తన స్టైల్ లో వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.

అయితే ఇలా మహిళలకు సపోర్ట్ చేయడంతో ఈమె సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఆయన వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా చిన్మయి మహిళలకు మద్దతుగా నిలబడుతూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఒక నెటిజన్ ఈ విషయం గురించి ఆమెకు కామెంట్ చేస్తూ మీరు ఇలా మహిళల పక్షాన మాట్లాడుతూ వారికి ఇలా సహాయం చేయడం నాకు చాలా బాగా నచ్చింది.

మీరు ఎప్పుడూ ఇలాగే అందరికి సహాయం చేయండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ కు చిన్మయి నుంచి ఏ విధమైనటువంటి రిప్లై రాకపోవడంతో ఆ వ్యక్తి తన అసలు రూపం బయటపెట్టారు.మరోసారి ఆమెకు కామెంట్ చేస్తూ నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా అంటూ అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. నీకేం కావాలన్నా కొనిస్తాను లగ్జరీ లైఫ్ ఇస్తా అంటూ చెత్త కామెంట్స్ చేశారు.

ఇలా ఆ వ్యక్తి ఇలాంటి చెత్త కామెంట్స్ చేయడంతో స్పందించిన చిన్మయి తనకు తన స్టైల్ లోనే వార్నింగ్ ఇచ్చారు. నేను వీడికి రిప్లై ఇవ్వకపోయేసరికి వీడి ఈగో దెబ్బతిన్నట్టు ఉంది. ఇలాంటి వాడిని ఏం చేయాలి ఆయన తప్పు వీడిది కాదు వీడిని ఇలా పెంచిన తన తండ్రిది అంటూ ఈమె ఫైర్ అయ్యారు. సమాజంలో ఇలాంటి ఎదవలు చాలామంది ఉన్నారు. అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ చిన్మయి (Chinmayi) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus