Chinmayi Sripada: సమంతను నిందించాల్సిన అవసరం లేదంటున్న చిన్మయి!

సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పాపులర్ అయిన చిన్మయి తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పలు సందర్భాల్లో చిన్మయి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచినా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా తక్కువేం కాదు. సమంత నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలకు చిన్మయి డబ్బింగ్ చెప్పారు. సమంతకు చిన్మయి వాయిస్ సూట్ అయిన స్థాయిలో మరే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ సూట్ కాదు.

సమంత సినిమాలలో అద్భుతంగా నటిస్తే చిన్మయి తన గాత్రంతో ఆ పాత్రలకు ప్రాణం పోస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సమంత మంచి వ్యక్తి అని చిన్మయి అన్నారు. తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నాకు కెరీర్ వచ్చిందంటే అందుకు సమంత కారణమని చిన్మయి తెలిపారు. ప్రస్తుతం సామ్ తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటోందని చిన్మయి చెప్పుకొచ్చారు. ఈ విషయంలో నాకు ఆనందంగా ఉందని చిన్మయి కామెంట్లు చేశారు.

సమంతకు నేను డబ్బింగ్ చెప్పే స్టేజ్ ముగింపుకు వచ్చిందని నేను అనుకుంటున్నానని ఆమె అన్నారు. సమంత, నేను కలిసిన సమయంలో ఆ ఫోటోలను పెట్టకపోయినంత మాత్రాన నేను, సమంత విడిపోయినట్లు కాదని చిన్మయి కామెంట్లు చేశారు. నా పర్సనల్ లైఫ్ ను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదని ఆమె అన్నారు. మేము కలుసుకున్నామని మాట్లాడుకున్నామని డిన్నర్ కు వెళ్లామని చెప్పడం వల్ల ఎవరికి లాభమని చిన్మయి ప్రశ్నించారు.

నేను, సమంత కలవాలని అనుకుంటే ఇంట్లోనే కలుస్తామని ఆమె అన్నారు. ఫ్యామిలీ మేన్2 రిలీజ్ సమయంలో సమంతపై కొందరు విమర్శలు చేశారని ఆమె చెప్పుకొచ్చారు. అది నాకు నచ్చకపోవడంతో సమంతను సపోర్ట్ చేస్తూ మాట్లాడానని ఆమె అన్నారు. సమంత పాత్ర మీకు నచ్చకపోతే మర్యాదపూర్వకంగా అభిప్రాయాన్ని బయటపెట్టొచ్చని ఆమె అన్నారు. అంతే తప్ప సమంతను నిందించాల్సిన అవసరం లేదని చిన్మయి కామెంట్లు చేశారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus