Singer Noel: నోయల్ ఇంట్లో విషాదం.. అతని తండ్రి మృతి

ర్యాప‌ర్‌గా,సింగర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన నోయల్… నటుడిగా కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతేడాది ‘బిగ్ బాస్4’ లో ఇతను ఓ కంటెస్టెంట్‌గా కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా హీరోయిన్ ఎస్తేర్ ని ప్రేమ వివాహం చేసుకుని ఏడాది తిరక్కుండానే విడాకులు తీసుకోవడం తో అతను ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇటీవల ‘పంచతంత్ర కథలు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోయల్ .. ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా.. నోయల్ ఇంట్లో విషాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆయన తండ్రి శామ్యూల్ గ‌త రాత్రి కన్నుమూసారు. దీంతో వారి కుటుంబం అంతా కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక నోయల్ తండ్రికి సంగీత దర్శకుడు కీర‌వాణి అలాగే సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ వంటి వారు నివాళులు అర్పించారు. అలాగే ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు నోయల్ ఇంటికి వెళ్లి అతనికి అతనికి కుటుంబానికి ధైర్యం చెబుతున్నారు.

నోయ‌ల్ కు అతని తండ్రి అంటే చాలా ఇష్టమని ‘బిగ్ బాస్ 4’ లో చెప్పిన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్న రోజుల్లో నోయల్ తన కుటుంబం గురించి మాట్లాడుతూ… ” మా అమ్మ ఇంటింటికి తిరిగి పనులు చేస్తే వంద రూపాయలు వచ్చేని, మా నాన్న గారు డైలీ లేబర్ గా అన్ని రకాల పనులు చేసేవారు.

ఇస్త్రీ, మేస్త్రి, మెకానిక్ షెడ్ లో పనిచేయడం ఇలాంటివి ఎన్నో చేసేవారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం.. చాలా రెస్పెక్ట్ కూడా” అంటూ చెప్పుకొచ్చాడు. కానీ వికీపీడియాలో మాత్రం నోయల్ తండ్రి రిటైర్డ్ డిఫెన్స్ ఆఫీస‌ర్ అని ఉండడంతో .. సింపతీ కోసం అబద్దాలు ఆడుతున్నాడు అని అప్ప‌ట్లో నోయ‌ల్‌ని తెగ ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus