ఈ మధ్య కాలంలో దేశంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు ఆడపిల్లలను భయాందోళనకు గురి చేసే విధంగా ఉన్నాయి. మహిళలకు భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోల్ కతాలో కొన్ని వారాల క్రితం చోటు చేసుకున్న ఘటన ఒకింత సంచలనం అయింది. స్టార్ సింగర్ శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) మాట్లాడుతూ కోల్ కతా ఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
కోల్ కతా జూనియర్ డాక్టర్ ఘటన గురించి తెలిసిన తర్వాత నాకు వెన్నులో వణుకు పుట్టిందని శ్రేయా ఘోషల్ తెలిపారు. ఆ ఘటన వల్ల కోల్ కతాలో జరగాల్సిన కాన్సర్ట్ ను వాయిదా వేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల రక్షణ కొరకు తాను ప్రార్థనలు చేస్తున్నానని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చారు. కోల్ కతా ఘటనతో నేను చాలా బాధ పడ్డానని ఆమె వెల్లడించారు.
కోల్ కతా ఘటన నాపై తీవ్ర ప్రభావం చూపిందని శ్రేయా ఘోషల్ వెల్లడించారు. కోల్ కతా ఘటన పూర్తిగా క్రూరమైన చర్య అని ఆమె తెలిపారు. కోల్ కతాలో జరగాల్సిన కాన్సర్ట్ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తానని శ్రేయా ఘోషల్ పేర్కొన్నారు. సంగీత ప్రియులకు ఈ కచేరీ చాలా అవసరమని ఆమె అన్నారు. కానీ కచేరీ కంటే మహిళల గౌరవం, వారి భద్రత కొరకు నేను ప్రార్థనలు చేస్తున్నానని శ్రేయా ఘోషల్ చెప్పుకొచ్చారు.
అందుకే ఈ షోను వాయిదా వేస్తున్నానని నా నిర్ణయాన్ని మీరంతా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని ఆమె వెల్లడించారు. శ్రేయా ఘోషల్ ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించి ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో ఆమెకు ఏకంగా 7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. శ్రేయా ఘోషల్ రెమ్యునరేషన్ ఒకింత భారీ రేంజ్ లో ఉంది. ఆమె పాట పాడితే ఆడియో రైట్స్ సైతం భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి.
❤️ pic.twitter.com/Pk0QfsI6CM
— Shreya Ghoshal (@shreyaghoshal) August 31, 2024