Singer Sunitha: సునీతను అంత తప్పుగా అర్థం చేసుకున్నదెవరబ్బా!

జీవితాన్ని ఒకసారి తరచి చూసుకుంటే… అప్పటివరకు మనం పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అనుభవాలు, పంటికింద బిగువన పెట్టుకున్న బాధలు కనిపిస్తాయి. అవి లేని జీవితం, ప్రయాణం ఉండవు. ప్రముఖ గాయని సునీత జీవితంలోనూ ఇలాంటివి చాలా ఉన్నాయి. వివిధ సందర్భాల్లో ఆమె వాటి గురించి చెప్పుకుంటూ వచ్చారు. తాజాగా తన 25 ఏళ్ల వయసులో జరిగిన ఓ సంఘటనను చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆమె పడ్డ ఇబ్బందిని, బాధను వివరించే ప్రయత్నం చేశారు సునీత.

గాయకురాలిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తెలుగువారికి చేరువైన సునీత వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల రామ్‌తో మరోసారి ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె జీవితాన్ని తరచిచూసే ప్రయత్నం చేస్తే ఆమె ఎదుర్కొన్న అనే సమస్యలు బయటికొచ్చాయి. మొదటి పెళ్లి, బ్రేకప్‌ తర్వాత రామ్‌తో పెళ్లి జరిగే వరకూ సుమారు 15 సంవత్సరాలపాటు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు సునీత.‘‘నా ప్రపోజల్‌ ఒప్పుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒప్పుకోకపోతే బాధపడతాను.

అంతే కానీ జీవితం ఎక్కడా ఆగదు’ అని ప్రపోజల్‌ టైమ్‌లో రామ్‌.. సునీతతో అన్నారట. ఆయనలోని నిజాయతీ నచ్చి ఆమె ఓకే చెప్పారట. ఈ క్రమంలో చాలా మంది తన గురించి తప్పుగా మాట్లాడారని, డబ్బు కోసమే రామ్‌ని పెళ్లి చేసుకున్నానన్నాను అని అన్నారని సునీత్‌ చెప్పుకొచ్చారు. దాంతోపాటు గతంలో జరిగిన ఓ విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు.25 ఏళ్ల వయసులో ఒక మ్యూజిక్‌ ప్రోగ్రామ్‌కి వెళ్లారట సునీత. ప్రోగ్రామ్‌లో భాగంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇచ్చిన మైక్‌ని అందుకున్నారట.

అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత.. ఆ సంగీత దర్శకుడి సతీమణి వచ్చి.. ‘ఇందాక నువ్వు మైక్‌ తీసుకుంటూ ఆయన చేతిని తాకావు. ఆయనపై నీకున్న ఆలోచన ఏమిటి?’ అని అన్నారట. ఆ మాటలకు సునీత చాలా బాధపడ్డారట.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus