Sunitha: డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి అతనే కారణం.. సునీత ఎమోషనల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా గుర్తింపు పొందిన సునీత గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ వందల సంఖ్యలో అద్భుతమైన పాటలు పాడిన సునీత స్టార్ సింగర్ గా గుర్తింపు పొందింది. ఇప్పటికీ సునీత తన గాత్రంతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. ఇలా సింగర్ గా పాటలు పాడటమే కాకుండా ఎంతోమంది హీరోయిన్లకు తన వాయిస్ తో డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా ఇటీవల సునీత రెండవ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ వీరపనేని అనే వ్యక్తిని కుటుంబ సభ్యుల ఆమోదంతో సునిత రెండవ వివాహం చేసుకుంది. అయితే అప్పటివరకు ఒక సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీతని అభిమానించే ప్రేక్షకులు ఆమె రెండవ వివాహం చేసుకున్న తర్వాత మాత్రం ఆమె మీద విమర్శలు గుప్పిస్తున్నారు. సునీత కెరియర్ పరంగా ఎంతో విజయం సాధించినప్పటికీ వ్యక్తిగత విషయంలో మాత్రం ఈమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

మొదట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సునీత ఇద్దరు పిల్లలు తర్వాత తన భర్త వదిలేయడంతో తన పిల్లలు బాగోగులు చూసుకుంటూ జీవితంలో ముందుకు వెళుతున్నటువంటి ఈమె ఒకానొక సమయంలో పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను గుర్తుచేసుకొని బాధపడ్డారు. ఆ క్లిష్ట సమయంలో బాలసుబ్రమణ్యం గారు నాకు అండగా ఉండి ఆ బాధనుండి నన్ను బయటపడేలా చేశాడు.

ఈ విషయంలో నేనెప్పుడూ ఆయనకి కృతజ్ఞురాలిని అని చెబుతూ బాలసుబ్రమణ్యం గారి మృతిని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఇక రెండవ పెళ్లి గురించి మాట్లాడుతూ చాలామంది తన రెండవ పెళ్లి పై విమర్శలు చేశారు అయితే ఇలాంటి పని పాట లేనటువంటి వ్యక్తులే ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ వారి గురించి విమర్శలు చేస్తున్నారని అయితే ప్రస్తుతం తాను వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus