Sunitha: నిన్నటి నిజం… ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా ఎమోషనల్ పోస్ట్ చేసిన సునీత!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో సింగర్ సునీత ఒకరు. ప్రస్తుతం ఈమె సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి సునీత సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తనకు గురువు అనే విషయం మనకు తెలిసిందే. బాలసుబ్రమణ్యం గారితో సునీతకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇక బాలసుబ్రమణ్యం గారు మరణించినప్పటికీ సునీత తరచూ ఆయనని తలుచుకుని సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తుంటారు.

అయితే తాజగా నేడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి జయంతి కావడంతో (Sunitha)  సునీత సోషల్ మీడియా వేదికగా బాలు గారిని గుర్తు చేసుకుంటూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే సునీత ఇన్స్టాగ్రామ్ ద్వారా బాలు గారిని తలుచుకుంటూ… నిన్నటి నిజం… ఇవాళ జ్ఞాపకం అంటే ఎలా పుట్టినరోజు శుభాకాంక్షలు నేరుగా చెప్పుకునే అదృష్టం లేకుండా చేసిన ఆ భగవంతుడిని ఈ విషయంలో తాను ఎప్పటికీ నిందిస్తూనే ఉంటానని

ఈమె బాలు గారితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఆయన జయంతి సందర్భంగా తనని తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సుబ్రహ్మణ్యం గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సెప్టెంబర్ 25వ తేదీ 2020 వ సంవత్సరంలో మరణించిన విషయం మనకు తెలిసిందే.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus