సింగర్ సునీతకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె వాయిస్ తో పాటు అందాన్ని కూడా పొగిడేస్తుంటారు నెటిజన్లు. ఇటీవల సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు కొంత నెగెటివిటీ ఎదురైంది. కానీ అలాంటి నెగెటివ్ కామెంట్స్ ను ఆమె పెద్దగా పట్టించుకోదు. కానీ అవి శృతిమించాయంటే మాత్రం ఆమె ఘాటుగా స్పందిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను షేర్ చేయడంతో పాటు తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలను సైతం పోస్ట్ చేస్తుంది.
సునీత-రామ్ వీరపనేని జంటపై పాజిటివ్ కామెంట్స్ కంటే నెగెటివ్ కామెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీటిపై సునీత పెద్దగా రియాక్ట్ అవ్వదు కానీ.. ఓ నెటిజన్ తన భర్తను ఉద్దేశించి చేసిన కామెంట్ కి సునీత హర్ట్ అయింది. వెంటనే అతడికి ధీటుగా సమాధానమిచ్చింది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం వద్దకు సునీత తన భర్తతో కలిసి వెళ్లింది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ ఓ ఫొటోను షేర్ చేసింది సునీత.
ఇది చూసిన ఓ నెటిజన్ హద్దులు మీరు కామెంట్ చేశాడు. ”కాకి ముక్కుకు దొండ పండు. సునీతకు ముసలి రామ్ మొగుడు! అందం ఈమె సొంతం ధనము ఆయన సొంతం! గానం ఈవిడది దర్జా అతనిది!” అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడాడు. ఇది చూసిన సునీత.. ‘నోటి దూల నీది. నీ భారం భూమిది’ అంటూ అతగాడి స్టైల్ లోనే కౌంటర్ వేసింది. సునీత ఇచ్చిన రిప్లై చూసిన అభిమానులు..
బాగా బుద్ధిచెప్పారంటూ స్పందిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు కచ్చితంగా సమాధానాలు ఇవ్వాలని.. లేదంటే ఇలానే వాగుతుంటారంటూ సునీతకి సజెషన్స్ ఇస్తున్నారు.