బాలుగారు అంటూ లవ్ ఎమోజీ పెడుతూ.. సునీత పోస్ట్ చేసిన వీడియో వైరల్..!

తెలుగు సినిమా ఉన్నన్ని రోజులు దివంగత స్టార్ సింగర్ ఎస్పీ.బాలసుబ్రమణ్యం పేరుని స్మరించుకుంటూనే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవ్వరూ ఊహించని విధంగా ఆయన కరోనాకి గురయ్యి.. సెప్టెంబరు 25న ఆయనఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకూ చెన్నైలోని ఎం.జి.ఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ వచ్చిన ఆయన కరోనాతో మరణించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన్ని మనం గుర్తుచేసుకోవడానికి ఎన్నో సూపర్ హిట్ పాటలను మనకి అందించి వెళ్లారు బాలుగారు.

ఏదో ఒక పాట రూపంలో ఆయన్ని మనం గుర్తుచేసుకుంటూనే వస్తున్నాం. తాజాగా సింగర్ సునీత కూడా బాలు గారిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఆయనతో ఓ స్టేజి పైన ‘సీతారామ రాజు’ చిత్రంలోని ‘ఏవండోయ్ శ్రీవారు’ పాటకు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన క్షణాన్ని గుర్తుచేసుకుంటూ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సునీత. దాంతో పాటు.. ‘బాలు గారు’ అంటూ కామెంట్ పెట్టి ఓ లవ్ ఎమోజిని కూడా జతచేసింది. ప్రస్తుతం సునీత పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక ఈ మధ్యనే బాలు గారికి ఓ అరుదైన గౌరవం కూడా దక్కిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. తమిళనాడు కోటాలో ఆయనకి ఈ అవార్డు దక్కడం విశేషం. దీని పై టాలీవుడ్ బడా సెలబ్రిటీలు సైతం హర్షం వ్యక్తం చేశారు.


Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus