టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన సునీత ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే రెండో పెళ్ళి ఇష్యుతో ఆమె మరింతగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి. రెండో పెళ్లి విషయంలో ఈమె నిర్ణయాన్ని కొంతమంది నెటిజన్లు తప్పుపడుతూ కామెంట్లు చేసినా… సినీప్రముఖులు ఈమెకు అండగా నిలబడ్డారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సునీత చాలా సంతోషంగా ఉందనే చెప్పాలి.రెండో పెళ్లి తర్వాత బుల్లితెర పై కూడా పలు షోలకు జడ్జిగా, మెంటర్ గా వ్యవహరిస్తూ వస్తోంది సునీత.
మరోపక్క ఆమె పిల్లల భవిష్యత్తుని కూడా సెట్ చేసినట్టు అయ్యింది.అంతేకాకుండా సమయం దొరికినప్పుడల్లా తన భర్త రామ్ వీరపనేనితో టూర్లు వేస్తూ.. లైఫ్ ను మరింతగా ఎంజాయ్ చేస్తుంది సునీత. ఎప్పటికప్పుడు ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటుంది సునీత.తాజాగా కొన్ని ఫోటోలను ఈమె షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఈమె తన ఫ్యామిలీ, కెరీర్ తో బిజీగా ఉన్నానని.
అయినప్పటికీ దేవుడు సృష్టించిన ప్రకృతిని కూడా ఆస్వాదించాలనిపించి ఇలా చేస్తున్నాను.. అంటూ ఆమె చెప్పుకొచ్చింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :