గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి దాదాపు ఏడాది కావొస్తుంది. సింగర్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గతేడాది 2020 సెప్టెంబర్ 25న కన్నుమూశారు. భౌతికంగా ఆయన దూరమైనా తన సంగీతంతో ఎప్పటికీ చిరంజీవిలా నిలిచిపోతారు. ఆయన దూరమై ఏడాది అవుతుండడంతో సింగర్ సునీత ఎస్పీబీను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ”మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది.
ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధం లో నా గొంతు మూగబోతోంది. సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ,ధైర్యం,బలం,నమ్మకం ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా.. బతికేస్తున్నా..” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ గా రాసుకొచ్చింది.ఎస్పీబీతో కలిసి సునీత ఎన్నో పాటలు పాడింది. అలానే పలు స్టేజ్ పాలుపంచుకుంది.
ఆయన్ను కుటుంబసభ్యుడిలా భావిస్తుంటుంది సునీత. ఆయన మరణించినప్పుడు కూడా ఆమె ఎంతో ఎమోషనల్ అయింది. ఇప్పుడు ఆయన్ను గుర్తుంచేసుకుంటూ మరోసారి భావోద్వేగానికి గురైంది.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!