#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

శ్రీవిష్ణు (Sree Vishnu)  హీరోగా కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో వచ్చిన ‘సింగిల్’ (#Single) మే 9న రిలీజ్ అయ్యింది. వెన్నెల కిషోర్(Vennela Kishore), శ్రీవిష్ణు..ల కామెడీ వర్కౌట్ అయ్యింది అని అంతా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో బన్నీ వాస్ (Bunny Vasu), విద్యా కొప్పినీడి(Koppineedi Vidya) ఈ సినిమాను నిర్మించారు. చాలా ఏరియాల్లో ఈ సినిమాని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ ఓన్ రిలీజ్ చేసుకుంది. అందువల్ల బయ్యర్స్ పై ఎక్కువ భారం పడలేదు. అయితే సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

#Single Collections:

6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. రెండో వీకెండ్ కు సినిమాలు లేకపోవడం వల్ల మాస్ ఏరియాల్లో ఈ సినిమాని బాగానే చూస్తున్నారు. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 2.98 cr
సీడెడ్ 0.53 cr
ఉత్తరాంధ్ర 0.68 cr
ఈస్ట్ 0.25 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.49 cr
కృష్ణా 0.45 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 5.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
1.92 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 7.66 cr (షేర్)

‘సింగిల్’ సినిమా రూ.6.6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 9 రోజుల్లో ఈ సినిమా రూ.7.66 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ.11.91 కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా మొత్తంగా రూ.1.06 కోట్ల లాభాలను అందించింది.

‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus