Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha Ruth Prabhu) నిర్మాతగా మారి ‘శుభం’ (Subham) అనే సినిమాని రూపొందించిన సంగతి తెలిసిందే. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula)  దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయ్యింది. సీరియల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని హారర్‌ కామెడీ మూవీగా దీనిని రూపొందించారు. గవిరెడ్డి శ్రీనివాస వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది.

Subham Collections:

6 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి మొదటి వారం పర్వాలేదు అనిపించిన ఈ సినిమా రెండో వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకునేలా ఉంది. ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.90 cr
సీడెడ్ 0.24 cr
ఉత్తరాంధ్ర 0.98 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.12 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.28 cr
ఓవర్సీస్ 0.55 cr
వరల్డ్ వైడ్(టోటల్) 2.95 cr (షేర్)

‘శుభం’ (Subham) చిత్రానికి రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజుల్లో రూ.2.95 కోట్లు షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.4.92 కోట్లు కలెక్ట్ చేసింది.

కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus