బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ జరగకముందు , అంటే అనీమాస్టర్ వెళ్లిపోయిన తర్వాత షణ్ముక్ అండ్ సిరి సీరియస్ మోజ్ రూమ్ లో కూర్చుని డిస్కషన్ చేసుకున్నారు. ఇక్కడే షణ్ముక్ రవి ఇంకా శ్రీరామ్ ల గురించి మాట్లాడాడు. ఎలిమినేట్ అవుతున్న ప్రతి ఒక్కరూ శ్రీరామ్ నీకు జనాలు ఉన్నారు అంటూ మాట్లాడారు.ఎవరన్నారు అంటే విశ్వ, అనిమాస్టర్ అంటూ పేర్లు చెప్పాడు షణ్ముక్. ఇక్కడ మాత్రం ఒక్కడే అని అంటున్నారు కదా అంటూ సిరి అడిగింది.
అదే కదా ఇప్పుడు రవి ఉన్నాడా అయినా ఒక్కడే అంటున్నాడు. కావాలనే చేస్తున్నాడు అంటూ మాట్లాడాడు షణ్ముక్. ఒక్కడే ఉంటే నేను రవి వెళ్లినపుడు అతడ్ని ఎందుకు కాల్చలేదు అన్నాడు. రవికి ఎవరూ లేరు, లోబో విశ్వ ఉండేవాళ్లు ఇప్పుడు వాళ్లిద్దరూ ఉన్నారు ఉండనీ అంటూ మాట్లాడాడు.అంతేకాదు, వాళ్ల హోల్ పాయింట్ ఏంటో తెలుసా.. ఇప్పుడు నన్ను కిందకి దించడానికి మనిద్దరిదీ ఉందని అంటున్నారు. ఎందుకు..? నీకు కారణం బాగా తెలుసు ! వాళ్లిద్దరిలో ఎవరికైనా టైటిల్ వచ్చినా పర్లేదు.. ఆడికి మాత్రం వద్దని పద్దతిలో ఉన్నారని తన గురించి చెప్పాడు షణ్ముక్.
అందుకే నీది నాది ఎక్కువ తీయడం, అదే టైమ్ లో మనది సీన్ అవ్వడం అనేది బాగా వాళ్లకి కలిసొచ్చింది. నేను ఒకటే నమ్ముతా నిన్ను నమ్మి ప్రేమించేవాడు నిన్ను వదలడు. బయట నిన్ను నమ్మాడు ఉంటాడు వాడు ఎండింగ్ వరకూ ఉంటాడు అంటూ మాట్లాడాడు. ఎవరు ఎంత ఎడ్వాంటేజ్ తీస్కున్నా, ఎవరు ఎంత నన్ను తొక్కాలని అనుకున్నా దొబ్బదు. అంటూ తన మనసులో మాటల్ని బయటపెట్టాడు షణ్ముక్. దీనికి సిరి తల ఊపుతూ కూర్చుంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!