Siri, Kajal: సిరి కావాలనే కాజల్ ని టార్గెట్ చేసిందా..? షణ్ముక్ ఆనందం ఎందుకు..?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాగార్జున హౌస్ మేట్స్ తో మజా అయిన గేమ్స్ ఆడించాడు. అయితే, అంతకంటే ముందు శుక్రవారం రోజు హౌస్ లో ఏం జరిగింది అనేది ప్రేక్షకులకి చూపించాడు. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ కాజల్ గేమ్ గురించీ మాట్లాడారు. ముఖ్యంగా కాజల్ శ్రీరామ్ ఓటింగ్ విషయంలో కాజల్ రాంగ్ గా మాట్లాడిందని ప్రూవ్ చేశాడు శ్రీరామ్. షణ్ముక్ ఇంకా డిసైడ్ అవ్వలేదని, అందుకే నేను మానస్ కి ఇచ్చానని చెప్పాడు. దీంతో శ్రీరామ్ క్లారిఫికేషన్ ఇచ్చినట్లు అయ్యింది. ఇక ఇక్కడ్నుంచే అసలు మజా అనేది స్టార్ట్ అయ్యింది.

హౌస్ లో టీవియస్ అపాచీ టాస్క్ అనేది స్టార్ట్ అయ్యింది. శ్రీరామ్ కి కాలు బాగోలేదు కాబట్టి హౌస్ లో ఉన్న ముగ్గురు మగాళ్లు ఇందులో పాల్గొన్నారు. ఈ టాస్క్ కి కాజల్ ని సంచాలక్ గా పెట్టారు. నాలుగు విభాగాలుగా ఈ టాస్క్ ని ఫినిష్ చేయమని చెప్పాడు బిగ్ బాస్. ఇక్కడే సన్నీ అందరికంటే ముందుగా అన్నీ చేసేస్తున్నాడు. కానీ, ప్రశ్నని మాత్రం పైకి చదవకుండా ఆన్సర్ పెట్టి వచ్చాడు. ఇది కాజల్ గమనించలేదు. ఆ తర్వాత షణ్ముక్ ప్రశ్నని పైకి చదివేసరికి గుర్తుకొచ్చింది. సన్నీ టాస్క్ ఫినిష్ చేశాక, నువ్వు ప్రశ్నని పైకి చదవలేదురా అంటూ మాట్లాడింది.

నిజానికి ఆ తర్వాత వచ్చిన షణ్ముక్ కి విన్నర్ గా ప్రకటించాల్సింది కానీ, చేయలేదు. సంచాలక్ గా నిన్ను పైకి చదవమని చెప్పకపోవడం నామిస్టేక్ కాబట్టి నేను నీకు ఇచ్చేస్తున్నా అంటూ ప్రకటించింది. దీంతో సిరి ఆగ్రహించింది. సంచాలక్ గా ఫెయిల్ కాబట్టి నీ ఫ్రెండ్ కి ఇస్తున్నావా..? సీజన్ అయిపోతోంది కదా అని నీ ఇష్టమున్నట్లుగా గేమ్ ఆడతావా అంటూ ఆర్గ్యూమెంట్ చేసింది. కాజల్ ని టార్గెట్ చేస్తూ మాటలు విసిరింది. అదే పొజీషన్ లో నేను ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు. నాపైన పడిపోయి అరుస్తారు అంటూ దెబ్బిపొడిచింది.

ఇక్కడే సన్నీ మిస్టేక్ అని ఒప్పుకుంది కదా వదిలేయ్ అని చెప్తున్నా వినలేదు. షణ్ముక్ అయితే సిరి అరుస్తుంటే అస్సలు వారించలేదు. కాజల్ కరెక్ట్ పాయింట్ లో దొరికిందని చెప్పి ఆనంద పడ్డాడు. ఇక మరోవైపు మానస్ సన్నీ తర్వాత ఎవరు వచ్చారు అనేది కాజల్ చూడలేదు అని, ఇప్పుడు నిన్ను విన్నర్ గా ప్రకటిస్తుంటే నీకేంటి ప్రాబ్లమ్ అంటూ చెప్పాడు. ఫైనల్ గా సన్నీకి ఇష్టం లేకపోయినా కూడా వెళ్లి అపాచీపై కూర్చుని ఫోజులిచ్చాడు. దీంతో ఈటాస్క్ విజేతగా సన్నీ నిలిచాడు. అదీ మేటర్.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus