ప్రామిసింగ్ గా ఉన్న సీత ట్రైలర్, ఈసారి హిట్ కన్ఫర్మ్

“నేనే రాజు నేనే మంత్రి” లాంటి డీసెంట్ హిట్ అనంతరం తేజ దర్శకత్వంలో వస్తున్న చిత్రం “సీత”. కాజల్ అగర్వాల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం టీజర్ మంచి ఇంట్రెస్త్ ను క్రియేట్ చేయగా.. ఇవాళ విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తిని మరింతగా పెంచింది. బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కామెడీతోపాటు సెంటిమెంట్స్ మరియు ఎమోషన్స్ కలయికగా రూపొందిందని తెలుస్తోంది.

సోనూసూద్ విలనిజం, లక్ష్మీభూపాల సంభాషణలు ట్రైలర్ లో ప్రత్యేక ఆకర్షణలుగా ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్న ఈ చిత్రం ట్రైలర్ ను చూస్తుంటే బెల్లంకొండ బాబు కూడా మొత్తానికి ఒక సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు అనిపిస్తోంది. “ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు” చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాన్ని కాదనుకొని మరీ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం అనేది చర్చనీయాంశం అయ్యింది. మరి తేజ ఈ సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus