నిడివి సమస్య.. ఒక్కోసారి సినిమాలో మంచి సన్నివేశాలను కూడా తీసేసేలా చేస్తుంది. దీంతో ఆ సీన్స్ తర్వాత చూసి.. ఎందుకు మూవీలో పెట్టలేదు అనిపిస్తుంది. అలాంటి ఓ సన్నివేశాన్ని ‘సీతా రామం’ సినిమా టీమ్ రిలీజ్ చేసింది. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఓ డిలీటెడ్ సీన్‌ను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఫుల్ ఎమోషనల్‌గా సాగే ఈ సీన్‌ను చిత్రబృందం సినిమాలో ఎందుకు ఉంచలేదు అంటూ.. నెటిజన్లు అడుగుతున్నారు. వాళ్లు అనుకున్నట్లే సీన్ అయితే అదిరిపోయింది అని చెప్పాలి.
పాకిస్థాన్ ఆర్మీలో చేతుల్లో చిక్కుకున్న హీరో దుల్కర్ సల్మాన్, కీలక పాత్రధారి సుమంత్ మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. పాకిస్థాన్ చేతుల్లో బందీగా ఉన్న సమయంలో ఓ పాక్ అధికారి వచ్చి.. ‘నేను మీకేం సాయం చేయలేకపోతున్నా’ అంటూ అపరాధ భావంతో చెబుతాడు. ఆ తర్వాత వాళ్ల ఆఖరి కోరిక తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఫ్రేమ్‌లో చూస్తే.. ఇద్దరూ ఆ బంకర్ లాంటి గది నుండి బయటకు వస్తాడు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోతారు.
ఆ సమయంలో అక్కడ కొంతమంది ఫుట్‌బాల్ ఆడుతూ కనిపిస్తారు. అప్పుడు రామ్ (దుల్కర్ సల్మాన్), విష్ణు (సుమంత్) కూడా ఫుట్‌బాల్ ఆడతారు. ఆ ఆటలో విష్ణు గెలుస్తాడు. అప్పుడు రామ్… ‘విష్ణు సర్.. మళ్లీ మీరే గెలిచారు’ అని దుల్కర్ అనగానే సుమంత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. రామ్ మీద పిడి గుద్దులతో విరుచుకుపడతాడు. ‘‘నేను నీలా అనాథను కాను, నా కోసం కుటుంబం ఎదురుచూస్తుంటుంది.
నాకు పుట్టింది బాబా లేక పాప అనేది కూడా తెలియదు’’ అంటూ విష్ణు ఆవేశంతో ఊగిపోతాడు. ఆ సమయంలో అక్కడున్న వారు వారిని సపరేట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ సీన్‌నే చిత్రబృందం డిలీటెడ్ సీన్‌గా షేర్ చేసింది. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ.. ‘సీతారామం’ సినిమా వచ్చి 50 రోజులు పూర్తయ్యాయి.
శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!