Sita Ramam Trailer: ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసే విధంగా ‘సీతా రామం’ ట్రైలర్!

ప్రేమ కథా చిత్రాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వాటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. కాకపోతే ప్రేమ కథా చిత్రాలు పెద్ద హీరోలు చేస్తే జనాలు చూడడం లేదు. చేయాల్సిన హీరోలు మాత్రమే చేయాలి. దుల్కర్ సల్మాన్ మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అతనికి లవర్ బాయ్ ఇమేజ్ ఉంది. ప్రేమ కథా చిత్రాలకు అతను కరెక్ట్ గా సెట్ అవుతాడు. త్వరలో అతని నుండి రాబోతున్న ప్రేమ కథా చిత్రం ‘సీతా రామం’.

టీజర్, పాటలతోనే మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కాబోతుంది. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. అనాథ అయిన సైనికుడు లెఫ్టినెంట్ రామ్ కు ప్రేమ అనేది కరువవుతుంది. అతనికి లెటర్ రాయడానికి ఒక్క వ్యక్తి కూడా లేడే అని బాధపడుతూ ఉంటాడు. కానీ ఒకరోజు సీత అనే అమ్మాయి నుండి అతనికి ఉత్తరం వస్తుంది.అందులో ఉన్న అక్షరాలు… రామ్ కు సీత పై ప్రేమ పుట్టేలా చేస్తాయి.

తర్వాత అతను ఆమెను కలుసుకోవడం.. ఆమెకు దగ్గరయ్యే క్రమంలో మళ్ళీ అతను కాశ్మీర్‌ కు వెళ్లడం, ఆ టైం లో అతను సీతకు ఒక లేఖ పంపడం, అది ఆమెకు చేరకపోవడం, 20 ఏళ్ల తర్వాత సీతకు ఆ లెటర్ అందజేసే పని రష్మిక తీసుకోవడం వంటిది ట్రైలర్ లో చూపించారు.చివరికి ఆ లెటర్ సీతకు అందిందా? అసలు సీత ఏమైనట్టు.? రామ్ కు ఏం జరిగింది? అనే సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. ముఖ్యంగా ఈ సినిమా కోసం టెక్నీకల్ టీం చాలా కష్టపడి పనిచేసిన ఫీలింగ్ కలిగించింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus