Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ వీక్ ని కాపాడిన శివాజీ..! గౌతమ్ తో గొడవకి కారణం ఇదే..!

  • September 9, 2023 / 10:28 AM IST

బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ వీక్ ని శివాజీ భుజాలపై వేసుకుని కాపాడాడా అనిపిస్తోంది. ఎందుకంటే, సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ తర్వాత మరోసారి అలాంటి కంటెస్టెంట్స్ నే ఎంచుకుని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. సీనియర్స్ షకీల, కిరణ్ రాథోడ్ లాంటి వాళ్లు వచ్చినా, ఇప్పుడు గ్లామర్ షో చేసే సీన్ లేదు. ఇక సీనియర్ శివాజీ తన యాక్టింగ్ టాలెంట్ తో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ని ఆడి హౌస్ మేట్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.

దీంతో పవర్ అస్త్రం సంపాదించేందుకు కంటెండర్ కూడా అయ్యాడు. ఇక్కడే హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం లాజిక్స్ వర్కౌట్ చేస్తుంటే తనదైన స్టైల్లో సామెతలు చెప్తూ వారికి చురకలు వేశాడు. ఒకవైపు రతికని కూల్ చేస్తూనే మరోవైపు గౌతమ్ కి ఫుల్ గా ఇచ్చిపారేశాడు. గౌతమ్ చెప్పిన రీజన్ కి శివాజీకి బాగా కోపం వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ మీరు మాత్రమే కాదు, హౌస్ లో ఎవరైనా సరే చేస్తారని గౌతమ్ అనేసరికి నీకు ఇచ్చిన బల్లి టాస్క్ ఎందుకు చేయలేదు ? నీది ఎందుకు పీకింది అంటూ ఆర్గ్యూమెంట్ చేశాడు.

అంతేకాదు, గౌతమ్ చెప్పిన రీజన్స్ ని ఎత్తిచూపుతూ నువ్వు చేయలేకపోయావ్ అని గౌతమ్ మాటలకి కౌంటర్స్ వేశాడు. ఇక శోభాశెట్టి కూడా రతికపై విరుచుకుపడుతుంటే బ్రేకులు వేశాడు. అమర్ దీప్ కూడా కావాలనే ప్రియాంక ఇంకా సందీప్ లకి సపోర్ట్ చేయాలనే వచ్చాడని ఇది క్లియర్ గా అర్ధం అవుతోంది కదా అంటూ మాట్లాడాడు.

దీంతో శివాజీ ఈవారం ఆడియన్స్ తో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఫస్ట్ వీక్ కాఫీ లొల్లి, షకీలతో చేసిన దెయ్యం ప్రాంక్, శుభశ్రీతో డ్యాన్స్ పెర్ఫామన్స్, రతికకి ధైర్యం చెప్పడం అలాగే గౌతమ్ కి క్లాస్ పీకడం, శోభాశెట్టిని బెదరగొట్టడం ఇలా అన్ని వైపులా తన నోటితోనే పదునైన మాటలతోనే సమాధానం చెప్పాడు.

శివాజీ పెర్ఫామన్స్ చూశాక కొద్దో గొప్పో షో హిట్ దిశగా వెళ్లడానికి సాయం చేస్తున్నాడనే అంటున్నారు ఆడియన్స్. 5 వారాల ఇమ్యూనిటీ పోటీలో రేస్ నుంచీ తప్పుకున్నా కూడా ఆడియన్స్ పాయింట్ ఆప్ వ్యూలో మాత్రం రేసులో నిలిచాడు. ఇలాగే శివాజీ తన గేమ్ లో లాజిక్స్ వర్కౌట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హాట్ ఫేవరెట్ కంటెస్టెంట్ అవుతాడనే అంటున్నారు బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) లవర్స్. అదీ మేటర్.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus