Bigg Boss 7 Telugu: ఆదివారం ఎపిసోడ్ లో జరిగింది ఇదే..! థామిని వెళ్లిపోతూ ఫైర్..!

బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డ్ అంటూ కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ ని హుషారెత్తిస్తాడు. అంతేకాదు, సండేరోజు ఏదో ఒక సినిమా ప్రమోషన్స్ కోసం గెస్ట్ లు కూడా వచ్చి హౌస్ మేట్స్ ని పలకరిస్తుంటారు. ఈ క్రమంలో స్కంధ మూవీ ప్రమోషన్స్ కోసం హీరో రామ్ పోతినేని వచ్చి బిగ్ బాస్ స్టేజ్ పై స్టెప్పులు వేశాడు. అంతేకాదు, నాగార్జునని పలకరిస్తూ చాలాసేపు హౌస్ మేట్స్ తో గేమ్ కూడా ఆడించాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ కి సెటైర్ వేస్తూ శివాజీ అడ్వైజ్ ఇచ్చాడు. వచ్చేటపుడు స్కంథ ట్రైలర్ చూశాను అని చాలా బాగా చేశావ్ అని చెప్తునే, త్వరగా పెళ్లి చేసుకో బ్రదర్ అంటూ మాట్లాడాడు శివాజీ. నామీద ఇష్టంతో చెప్తున్నారో, బాధతో చెప్తున్నారో అర్దం కావట్లేదంటూ రామ్ కౌంటర్ వేశాడు.

ఇప్పటికే లేట్ అయిపోతోంది. ఇంకా చాలా చేయాలి మనం అంటూ మాట్లాడాడు శివాజీ. దీనికి నాగార్జున స్పందిస్తూ, అదే అడిగాను నేను కూడా.. అయినా ఊబిలో ఉన్నోళ్లకి ఇంకొకళ్లని కూాడ ఊబిలోకి లాగాలని ఉంటుందంటూ అన్నాడు. దీంతో అక్కడ కాసేపు ఫన్ మొదలైంది. ఇక రామ్ శివాజీల మద్యన ఫన్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకంటే, గతంలో రామ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెట్టాడు.

అలాగే, శివాజీ కూడా తెలుగుదేశం కి సపోర్ట్ గా ఉంటాడన్న విషయం తెలిసిందే. అందుకే, మనం కలిసి చాలా పనులు చేయాలి అన్నాడని అంటున్నారు విశ్లేషకులు. ఇక హీరో రామ్ వచ్చి హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విభజించాడు. అందులో, శివాజీ టీమ్ స్కంధ విన్ అయ్యారు. మ్యూజిక్ ప్లే అయితే వచ్చి పాటలని గెస్ చేసి ముందుగా ఎవరైతే గంట కొడతారో వాళ్లు ఆపోజిట్ డ్యాన్సర్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ కాంపిటీషన్ లో ఎవరు ఎంత బాగా డ్యాన్స్ చేశారు అనేది హీరో రామ్ జడ్జి చేస్తూ మార్కులు ఇచ్చాడు.

హీరో రామ్ చాలా సరదాగా హౌస్ మేట్స్ తో చాలాసేపు గడిపాడు. స్టేజ్ పైన నాగార్జున కూడా హీరో రామ్ జోకులకి బాగా ఎంజాయ్ చేశాడు. ఇక ఎలిమినేషన్ లో థామిని వెళ్లిపోతూ హౌస్ మేట్స్ కి సలహాలు ఇచ్చింది. కొందరిపై ఫైర్ అయ్యింది. ముఖ్యంగా తన జెర్నీలో శివాజీ అన్నమాటలకి బాగా హర్ట్ అయ్యింది.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus