Bigg Boss 7 Telugu: బయటకి వచ్చేస్తానన్న ధీమాతో నోరు జారుతున్న శివాజీ..! అమర్ ని ఎంత మాట అన్నాడంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఏది జాగ్రత్తగా లేకపోయినా సరే, నోరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మొదటి వారం నుంచీ శివాజీ కొంచెం నోటిదూలని చూపిస్తునే ఉన్నాడు. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ కి, యావర్ కి ఫుల్ సపోర్టింగ్ గా ఉన్నాడు. ఇదే విషయాన్ని తన చేయి నొప్పితో బాధపడుతున్నా కూడా చెప్పాడు. కన్ఫెషన్ రూమ్ లో బాధపడ్డ శివాజీ తర్వాత బయటకి వచ్చి నేను కెప్టెన్ చేయాలనుకున్నవారిని చేశాను నాకు అది చాలు అంటూ మాట్లాడాడు.

పల్లవి ప్రశాంత్ ని కెప్టెన్ చేశా, యావర్ ని చేశా అంటూ ప్రగల్భాలు పలికాడు. తనకు గతంలో కెప్టెన్సీ ఛాన్స్ వచ్చినా కూడా అది పల్లవి ప్రశాంత్ కోసం త్యాగం చేశాడు. అప్పుడు త్యాగమూర్తిలాగా మాట్లాడాడు. ఇప్పుడు అమర్ దీప్ తనని కెప్టెన్సీ రేస్ నుంచీ తప్పించేసరికి చాలా ఆవేశపడ్డాడు. నేను ఒక వేస్ట్ ఫెలోని , నన్ను హౌస్ నుంచీ పంపించేయ్ బిగ్ బాస్ అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడే అమర్ ప్రియాంక, శోభా, గౌతమ్ ల ముందు తన ఆవేదనని వ్యక్తం చేశాడు.

అంతేకాదు, శివాజీ తనని నమ్మనని, ఆయన చనిపోయే ముందు కూడా తన పిల్లలకి నన్ను నమ్మద్దని చెప్తానని అన్నాడని చాలా బాధేసిందని అమర్ అన్నాడు. దీనికి శోభా.. నువ్వు ఎలిమినేట్ అయ్యాక వాళ్ల ఇంటికి వెళ్లి పిల్లల ముందు కూర్చుంటావా అంటూ గట్టిగా మాట్లాడింది. ఈ విషయంలో శివాజీ తప్పుగా మాట్లాడాడు. అలాగే, గతంలో కూడా అమర్ ని చాలాసార్లు నామినేట్ చేశాడు. ఇక కన్ఫెషన్ రూమ్ లో బిగ్ బాస్ తో మాట్లాడి వచ్చిన తర్వాత తేజకి కూడా క్లాస్ పీకాడు.

ఫస్ట్ రెండు వారాలు నువ్వు చాలా బాగున్నావ్ , మంచిగా ఎంటర్ టైన్ చేస్తున్నావ్, కానీ ఎప్పుడైతే శోభాతో పులిహోర కలపడం స్టార్ట్ చేశావో అప్పట్నుంచీ నీ గేమ్ పోయిందని చెప్పాడు. వాళ్లు కంటెంట్ క్రియేట్ చేయడానికే నీ దగ్గరకి వస్తున్నారని నీకు అర్ధం కావట్లేదని చెప్పాడు. తేజకి చిన్నసైజ్ క్లాస్ పీకాడు శివాజీ. బిగ్ బాస్ హౌస్ నుంచీ వెళ్లిపోతున్నానని శివాజీకి అర్దమైంది. అందుకే, అందరికీ క్లాస్ పీకుతున్నాడు. ఇక కన్ఫెషన్ రూమ్ లో కూాడ ఇదే విషయాన్ని బిగ్ బాస్ కి చెప్పాడు.

నన్ను బయటకి పపించేయ్ (Bigg Boss 7 Telugu) బిగ్ బాస్. రోజూ ఏడుస్తున్నాను, వాళ్ల ముందు ఏడ్వలేకపోతున్నా కానీ లోపల మాత్రం చాలా బాధ ఉంది అని చెప్పాడు. అంతేకాదు, ఇక్కడికి కప్ కొడదామనే వచ్చాను అని మంచిగా స్టార్ట్ చేసినా, పరిస్థితులు సహకరించడం లేదని అన్నాడు. ఇక ఈవారం ఖచ్చితంగా శివాజీ బయటకి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శివాజీకి షోల్డర్ సర్జరీ చేసి రెండు మూడు వారాలు రెస్ట్ కావాలని డాక్టర్స్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అదీ మేటర్.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus