ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 ప్రీ లుక్ పోస్టర్ విడుదల

చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ఎంతోమంది యువ నటీనటులకు ఇన్స్పిరేషన్. చిరంజీవి సినిమాలు మిస్ కాకుండా చూస్తూ ఆయన స్పూర్తితో సినీ గడప తొక్కి సక్సెస్ బాటలో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యువ హీరో రమేష్ కూడా అదే చిరంజీవి స్ఫూర్తిగా డిఫరెంట్ కథలను, నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే కన్నడలో ఓ సినిమా చేసి ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకున్నారు రమేష్.

చిరు వీరాభిమాని రమేష్ హీరోగా ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ఎస్.ఎమ్.ఎల్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా తెరకెక్కుతోంది. హేమంత్ దర్శకత్వంలో థ్రిల్లర్ నేపథ్యంలో సరికొత్తగా రూపొందుతున్న ఈ సినిమాకు సుధీర్ PR సినిమాటోగ్రఫీ చేస్తుండగా.. భరత్ ప్రమోద్ కో- డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఓ వైపు శరవేగంగా షూటింగ్ చేస్తూనే సరికొత్తగా ప్రమోషన్స్ చేస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్, రిలీజ్ చేశారు.

రక్తంతో తడిసిన పదునైన కత్తిని ఎవ్వరికీ కనిపించకుండా వీపున దాచి పెట్టిన హీరో లుక్ ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఈ ప్రీ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ చూస్తుంటే మాత్రం థ్రిల్లింగ్ జానర్ లో రాబోతున్న ఈ చిత్రంలో ఏదో కొత్త వైవిద్యం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. కాగా, ఈ పోస్టర్ చూసి సినిమా టైటిల్ గెస్ చేసే అవకాశం ప్రేక్షకులకే కల్పించింది చిత్రయూనిట్. ఎవ్వరైతే ఈ టైటిల్ గెస్ చేసి ఈ మెయిల్ కి (Info@smlproductions) పంపిస్తారో వారికి తమ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న తదుపరి సినిమాలో అవకాశం కల్పిస్తామని నిర్మాతలు తెలిపారు. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus