అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు శోభితకు (Sobhita Dhulipala) సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. చైతన్యతో (Naga Chaitanya) నిశ్చితార్థం తర్వాత శోభిత మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో శోభితకు పెరుగుతున్న క్రేజ్ చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. లవ్ సితార మూవీ తెలివైన అమ్మాయి కథ అని శోభిత చెప్పుకొచ్చారు. నాకున్న ఫ్రెండ్స్, బంధువులలో నమ్మకాన్ని వమ్ము చేసేవారు లేరని ఆమె కామెంట్లు చేశారు.
నా గురించి ఒక్క ముక్కలో, మూడు పదాలలో చెప్పాలని ఎవరైనా అడిగితే నాకు అలాంటి ప్రశ్నలు అస్సలు నచ్చవని శోభిత పేర్కొన్నారు. ఒకరు చేసిన పని వల్ల వాళ్లను ఇష్టపడకపోవడం జరగదని ఆమె తెలిపారు. నేను అమితంగా ప్రేమించే వాళ్లు, కుటుంబ సభ్యులు ఆ పరిస్థితులలో ఉన్నా వాళ్లతో నేను ఫ్రెండ్లీగానే ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.
నాలో నాకు నచ్చే విషయాలు ఇవేనని శోభిత తెలిపారు. మరోవైపు చైతన్య శోభితల పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చైతన్య సంతోషమే తమకు ముఖ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చైతన్య శోభిత కలిసి నటించాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. చైతన్య పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉంది. నాగచైతన్య కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
నాగచైతన్య నాగ్ తో కలిసి నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. నాగార్జున (Nagarjuna) , నాగచైతన్య కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చైతన్య తండేల్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తండేల్ (Thandel) సినిమాలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తండేల్ తో చైతన్యకు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.