Robo Collections: 14 ఏళ్ళ ‘రోబో’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

  • October 3, 2024 / 03:47 PM IST

‘జైలర్’ కి (Jailer) ముందు రజినీకాంత్ (Rajinikanth) హిట్టు సినిమా ఏది అంటే.. కచ్చితంగా ‘రోబో’ (Robo) అనే చెప్పాలి. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ అధినేత కళానిధిమారన్ (Kalanithi Maran) రూ.142 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆ టైంకి సౌత్లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంటే అదే. 2010 వ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది ఈ చిత్రం.

Robo Collections:

ఈ అక్టోబర్ 1కి ‘రోబో’ రిలీజ్ అయ్యి 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి తెలుగు వెర్షన్.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 14.85 cr
సీడెడ్  6.83 cr
ఉత్తరాంధ్ర  3.77 cr
ఈస్ట్  2.44  cr
వెస్ట్  2.25 cr
గుంటూరు  3.16 cr
కృష్ణా  2.19 cr
నెల్లూరు  1.58 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 37.07 cr

‘రోబో’ తెలుగు వెర్షన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.19 కోట్లు. ఓ డబ్బింగ్ సినిమాకి తెలుగులో అంత బిజినెస్ జరగడం ‘రోబో’ తోనే మొదలయ్యింది అని చెప్పాలి. అయితే ఫుల్ రన్లో ఈ చిత్రం ఏకంగా రూ.37.07 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు (Mahesh Babu) ‘ఖలేజా’ (Khaleja) , ఎన్టీఆర్ (Jr NTR)  ‘బృందావనం’ (Brundavanam) వంటి సినిమాలు పోటీగా ఉన్నా.. ‘రోబో’ బాక్సాఫీస్ రన్..కి బ్రేకులు వేయలేకపోయాయి.

ఆ విధంగా వార్2 సినిమా తారక్ కెరీర్ కు ప్లస్ కానుందా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus