తెలుగమ్మాయి నటి శోభితా ధూళిపాళ్ల ఓ హిందీ సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమెది ముస్లిం యువతి పాత్ర. ఈ నేపథ్యంలో చిత్రీకరణ ముగించుకుని ఆమె నేరుగా ఓ హోటల్‌కు వెళ్లిపోయిందట. అయితే పాత్ర కోసం వేసుకున్న బుర్ఖాను తీసేయకుండానే శోభిత హోటల్‌కు వెళ్లింది. తన పేరిట రూం బుక్ చేశారని, తాళాలు ఇవ్వాలని రిసెప్షన్‌లో ఉన్న ఓ వ్యక్తిని అడిగితే ఆమెకు తాళం ఇవ్వకుండా అనుచితంగా ప్రవర్తించారట.
ఈ విషయాన్ని శోభిత ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘షూటింగ్ కోసం వేసుకున్న దుస్తుల్లోనే హోటల్‌కు వెళ్లాను. నేను నటి అని అక్కడున్న రిసెప్షనిస్ట్‌కు తెలియదు. ఆ సమయంలో నేను బుర్ఖాల్లో ఉన్నా, నా బ్యాగు కూడా దుమ్ము పట్టి ఉంది. అదనపు గది తాళాలు కూడా ఇవ్వలేదు. కానీ, నేను ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను. అతనితో గొడవ పడాలని నేను అనుకోలేదు. నేను తలుచుకుంటే అతనికి నా గురించి చెప్పి సారీ చెప్పించుకునేదాన్ని. కానీ, నా చుట్టూ అంతమంది ఉన్నప్పటికీ కనీస మానవత్వం కూడా చూపలేదు. ఎవ్వరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. నేను ముస్లిం యువతిననుకుని కొద్దిసేపటి వరకు అతను నాతో ప్రవర్తించిన తీరుకే నేను ఇంతగా బాధపడుతుంటే.. ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇది చాలా తప్పు అని బాధపడింది.