Sonakshi Sinha: పబ్లిక్ గా హీరోయిన్ కి ప్రపోజ్ చేసిన బాయ్ ఫ్రెండ్!

Advertisement

గత కొంతకాలంగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, హీరో జహీర్ ఇక్బాల్ తో డేటింగ్ లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుకార్లను కొట్టిపారేసింది ఈ జంట అయినప్పటికీ వీరిద్దరి రిలేషన్ పై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ముంబై రోడ్లపై వీరిద్దరూ జంటగా తిరగడం, పార్టీలకు కలిసి వెళ్లడమే. అంతేకాదు.. ఇద్దరూ క్లోజ్ గా దిగిన ఫొటోలను కూడా తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఫిక్స్ అయిపోయింది.

ఈ నేపథ్యంలో సోనాక్షి బర్త్ డే సందర్భంగా తమ సీక్రెట్ రిలీస్ ను అఫీషియల్ గా ప్రకటించింది ఈ జంట. ఈ సందర్భంగా సోనాక్షితో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో తీసిన ఓ ఫన్నీ వీడియోను షేర్ చేస్తూ.. పబ్లిక్ గా ఆమెకి ‘ఐలవ్యూ’ చెప్పాడు ఇక్బాల్. ‘హ్యాపీ బర్త్ డే. నన్ను చంపనందుకు థాంక్యూ. ఐ లవ్యూ’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ.. ‘ఐ లవ్యూ.. ఇప్పుడు నేను నిన్ను చంపడానికి వస్తున్నా’ అంటూ కామెంట్ చేసింది.

దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం స్పష్టమైంది. ఇది చూసిన వీరి ఫ్యాన్స్.. ఫాలోవర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్బాల్ పోస్ట్ పై బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం స్పందించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల సోనాక్షి చేతికి డైమండ్ రింగ్ పెట్టుకున్న ఫొటోలను షేర్ చేస్తూ..తన డ్రీమ్ నిజమైందంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతూ అందరూ ఆమెకి ఎంగేజ్మెంట్ అయిందని అనుకున్నారు. కానీ సోనాక్షి తన కొత్త బ్రాండ్ నెయిల్ పాలిష్ ను ప్రమోట్ చేసినట్లు చెప్పి నెటిజన్లకు షాకిచ్చింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news