Sonam Kapoor: సోనమ్ కపూర్ ఇంట్లో సంబరాలు.. ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సోనమ్ కపూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. సోనమ్ కపూర్ సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. 2022 సంవత్సరం ఆగష్టు 20వ తేదీన ముద్దులొలుకుతున్న బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడని సోనమ్ కపూర్ పేర్కొన్నారు. వైద్యులు, నర్సులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు.. ఈ ప్రయాణంలో తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని సోనమ్ కపూర్ అన్నారు.

ఇది ప్రారంభం మాత్రమేనని ఆమె చెప్పుకొచ్చారు. బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసని ఆమె కామెంట్లు చేశారు. 2018 సంవత్సరంలో సోనమ్ కపూర్, ఆనంద్ ఆహుజాల వివాహం జరిగింది. ఈ ఏడాది మార్చి నెలలో తాను గర్భవతిననే విషయాన్ని సోనమ్ కపూర్ వెల్లడించారు. ఆ తర్వాత సోనమ్ కపూర్ మెటర్నిటీ షూట్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

లండన్ లో సోనమ్ కపూర్ సీమంతం వేడుకను జరుపుకోగా ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొట్టాయనే సంగతి తెలిసిందే. సోనమ్ మగబిడ్డకు జన్మనివ్వడంతో ఫ్యాన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోనమ్ కపూర్ పోస్ట్ కు కొన్ని గంటల్లోనే లక్షల సంఖ్యలో లైక్స్, వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. సోనమ్ కపూర్ మగబిడ్డకు జన్మనివ్వడంతో ఆమె కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి.

2007 సంవత్సరంలో సోనమ్ కపూర్ నటిగా కెరీర్ ను మొదలుపెట్టగా తక్కువ సంఖ్యలోనే సినిమాల్లో నటించినా హీరోయిన్ గా సోనమ్ కపూర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా ఆమె పలు సినిమాలలో నటించి విజయాలను అందుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటీమణులలో సోనమ్ కపూర్ కూడా ఒకరు కావడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus