Sonam Kapoor: మేధావులు మాత్రమే కొత్త విషయాల గురించి ఆలోచిస్తారు!

సోనమ్ కపూర్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోతుంది.రానా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కింగ్ ఆఫ్ కొత్త సినిమా వేడుకలు సోనమ్ కపూర్ గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇలా సోనం కపూర్ షూటింగ్ లొకేషన్లో అందరిని నిలబెట్టి మరి ఫోన్లలో మాట్లాడుతూ సమయం వృధా చేస్తుంది అంటూ ఈయన ఆమె గురించి పేరు ప్రస్తావించకుండా మాట్లాడారు. అయితే రానా చేసిన ఈ కామెంట్స్ ఎవరి గురించి అంటూ నేటిజన్స్ ఆరా తీయడం మొదలు పెడుతూ ఆమె మరెవరో కాదు సోనమ్ కపూర్ అంటూ ఈమె పట్ల తీవ్రస్థాయిలో ట్రోల్స్ చేశారు.

ఇలా సోనమ్ గురించి భారీ స్థాయిలో ట్రోల్స్ రావడంతో రానా చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా నటి సోనమ్ కపూర్ అలాగే దుల్కర్ కి కూడా క్షమాపణలు చెప్పారు. ఇలా ఈయన క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందనీ అందరూ భావించారు. రానా సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పినప్పటికీ సోనమ్ కపూర్ (Sonam Kapoor) మాత్రం రానాను క్షమించలేకపోతున్నారని తెలుస్తోంది.

అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ కనుక చూస్తే రానాకు కౌంటర్ ఇచ్చిందని స్పష్టంగా తెలుస్తుంది. అమెరికన్ యాక్టివిస్ట్ ఎలినార్ రూజ్వెల్ట్ చెప్పిన కోట్‌ను షేర్ చేసింది. ‘సంకుచిత మ‌న‌స్త‌త్వం క‌లిగిన వారు ఇత‌రుల గురించి మాట్లాడుతారు. సాధార‌ణ మ‌న‌షులు సంఘ‌ట‌న‌ల గురించి మాట్లాడుతారు.

మేధావులు మాత్ర‌మే నూత‌న ఆలోచ‌న‌ల గురించి చ‌ర్చించుకుంటారనే పోస్ట్ షేర్ చేయడమే కాకుండా దీనికి మరీ క్యాప్షన్ కూడా పెట్టారు. కొందరు వ్యక్తులు ఈ విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా వ్యక్తుల గురించి కల్పిత కథల గురించి మాట్లాడే వారికి ఇది అవసరం అనే క్యాప్షన్ తో సోనమ్ ఈ కొటేషన్ ను షేర్ చేసింది. దీంతో ఇది కచ్చితంగా రానాను ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus