Sonarika: కాబోయే భర్తతో హీరోయిన్ సోనారిక.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

హిందీ సీరియల్ ‘దేవోన్ కి దేవ్ మహాదేవ్’ లో పార్వతీదేవి పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయింది సోనారికా భడోరియా. అంతేకాదు ‘పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ’, ‘దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి’ వంటి సీరియల్స్ లో కూడా ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది.నాగ శౌర్య హీరోగా నటించిన ‘జాదూగాడు’ తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది.ఆ తర్వాత ‘స్పీడున్నోడు’ ‘ఈడో రకం ఆడో రకం’ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.

‘ఈడో రకం ఆడో రకం’ సినిమా బాగానే ఆడినా మిగిలిన రెండు నిరాశపరిచాయి. దాంతో ఈమెకు ఇక్కడ ఎక్కువ అవకాశాలు రాలేదు. అందుకే తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించింది. కానీ అక్కడ కూడా ఈమె ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఈమె గత కొంతకాలంగా వికాస్ భరత్ అనే వ్యక్తి తో డేటింగ్లో. బుధవారం నాడు ఇతని పుట్టినరోజు కావడంతో బీచ్ వద్ద అతనితో రొమాన్స్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘బంగారం లాంటి మనసున్న అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అనే క్యాప్షన్ ను కూడా పెట్టింది. త్వరలోనే ఇతనితో ఈమె ఏడడుగులు నడువబోతుంది అని తెలుస్తుంది. వీరి పెళ్లి ఇంట్లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి వీరి రొమాంటిక్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus