ప్రభాస్, ప్రియాంక చోప్రాలను పక్కకి నెట్టేసిన సోనూ!

ప్రతి ఏడాది చివరికి వచ్చేసరికి ఆ సంవత్సరంలో ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న వ్యక్తుల జాబితాలను రిలీజ్ చేస్తుంటారు. అందులో ఎక్కువగా సినిమా తారలే కనిపిస్తుంటారు. స్టార్ హీరోలు, హీరోయిన్ల పేర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే 2020లో మాత్రం ఓ విలన్ పేరు ఈ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ విలన్ ఎవరంటే.. నటుడు సోనూసూద్. కరోనా లాక్ డౌన్ సమయంలో అసాధారణ రీతిలో సేవా కార్యక్రమాలు చేపట్టి జనాల ఆదరణ పొందాడు. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కూడా తన సేవలను మాత్రం ఆపలేదు సోనూ.

ఈ క్రమంలో అతను ఆసియా స్థాయిలో 2020లో అత్యధిక ఆదరణ సంపాదించుకున్న సెలబ్రిటీగా నిలిచాడు. యూకే బేస్డ్ మీడియా సంస్థ ఈస్ట‌ర్న్ ఐ 2020 సంవ‌త్స‌రానికి వ‌ర‌ల్డ్ వైడ్ మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రెటీల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆసియా స్థాయిలో సోనూసూద్ అగ్ర స్థానంలో నిలిచాడు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, బాహుబలితో ఇంటర్నేషనల్ రేంజ్ సంపాదించుకున్న ప్రభాస్ లాంటి స్టార్లను వెనక్కి నెట్టి ఈ జాబితాలో టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు సోనూ.

ఈ లిస్ట్ లో ప్రియాంకకు ఆరో స్థానం దక్కగా.. ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ ఖాన్ హీరోలెవరూ కూడా టాప్ 10లో లేరు. సోనూ ఇండియాలో భారీ పాపులారిటీ సంపాదించాడు కానీ.. ఆసియా స్థాయిలో నంబర్ వన్ గా నిలవడం చిన్న విషయం కాదు. ఈ మధ్యకాలంలో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి తన దగ్గర డబ్బు లేకపోతే ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బు అప్పుగా తీసుకొని మరీ సేవలు చేస్తున్నాడు సోనూ.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus