Sonu Sood: తనకోసం సంబంధం చూడండి…వైరల్ అవుతున్న సోను సూద్ కామెంట్స్!

సోను సూద్ పరిచయం అవసరం లేని పేరు నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు. అయితే కరోనా తర్వాత సేవా కార్యక్రమాలను అలాగే కొనసాగిస్తూ ఆపదలో ఉన్నానని ఎవరైనా తనని సహాయం చేయమని అభ్యర్థిస్తే వారికి సహాయం చేస్తూ మంచి మనసు చాటుకున్నారు. ఇలా ఎంతోమందికి సహాయం చేస్తూ అందరి మదిలో దేవుడిగా ఉన్నటువంటి తాజాగా సంబంధం ఉంటే చూడండి అంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అయితే సంబంధం తనకు కాదండోయ్ రోడ్డు పక్కన మొక్కజొన్నలు అమ్మే వ్యాపారి కోసం పెళ్లి సంబంధం చూడాలంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. (Sonu Sood) సోనూ సూద్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి నుంచి సిస్సు వైపు ప్రయాణం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఆయనకి ఓ మొక్కజొన్న స్టాల్ కనిపించింది. వెంటనే అతను వద్దకు వెళ్లి మొక్కజొన్న కొనుగోలు చేయడమే కాకుండా రోజుకు ఎన్ని మొక్కజొన్నలు అమ్ముతారు అనే విషయాలన్నింటినీ అడిగి తెలుసుకున్నారు.

ఇలా వీరిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఆ మొక్కజొన్నల వ్యాపారి పేరు శేష ప్రకాష్ నిషాద్.జాన్ పూర్‌కు చెందినవాడిగా సోనూ సూద్‌కి పరిచయం చేసుకున్నాడు. ఒక్కొక్క మొక్కజొన్న రూ.50 కి విక్రమిస్తున్నానని .. ప్రతిరోజు 100 మొక్కజొన్నల కష్టాలు విక్రయిస్తానని తెలిపారు.

తనకు నలుగురు సోదరులు ఉన్నారని ఒక సోదరి ఉందని తెలిపారు. అయితే తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పడంతో సోను సూద్ నిషాద్ కోసం పెళ్లి సంబంధం చూడమంటూ ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. చివరికిగా సోనూ సూద్ తనకు, తనతో ఉన్న వారికి మొక్కజొన్నలు కొనుగోలు చేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus