Soundarya: చినుకు చినుకు అనే సాంగ్ కోసం సౌందర్య తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు.!

సినిమా ప్రపంచంలో అన్ని బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన నటి సౌందర్య. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే తన అందం , అభినయం తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె ఏ హీరో పక్కన నటించిన ఆ హీరో కి సరిజోడి అని అనిపిస్తుంది. ఈమె తో హీరోలకు ఉన్న కెమిస్ట్రీ ని చూస్తే అసలు నటిస్తున్నట్టు ఏ విధంగానూ అనిపించదు, జీవించినట్టే అనిపిస్తుంది.

చాలా సహజం గా మన ఇంట్లో అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది వెండితెర మీద ఈమెని చూసినప్పుడు. అందుకే ఆమె చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆమెని మర్చిపోలేకపోతున్నాము. ఎవరైనా హీరోయిన్ చూడముచ్చటగా ఉన్నా, అద్బుతముగా నటించినా ఆమెని మనం సౌందర్య తో పోల్చి చేస్తాము. నటన లో ఆ రేంజ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది ఈమె. అలా ఎంతో మంది సూపర్ స్టార్స్ తో కలిసి నటించిన ఈమె, ఒక కమెడియన్ తో కూడా కలిసి చిందులేసింది.

ఆ కమెడియన్ బాబు మోహన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఎస్ వీ కృష్ణా రెడ్డి మరియు రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన మాయలోడి చిత్రం లో బాబు మోహన్ మరియు సౌందర్య మధ్య వచ్చే ‘చినుకు చినుకు’ అనే సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఒక పాపులర్ హీరో సినిమాలో ఒక కమెడియన్ కి మరియు ఆ సినిమా హీరోయిన్ కి డ్యూయెట్ సాంగ్ పెట్టడం అనేది చరిత్ర లో జరగడం అదే తొలిసారి.

ఆ ప్రయత్నం చేసి సక్సెస్ సాధించడం మరో విశేషం.అప్పట్లో (Soundarya) సౌందర్య లాంటి అందగెత్త పక్కన బాబు మోహన్ ఏమిటి, అతనితో కలిసి ఈమె చిందులు వెయ్యడం ఏమిటి అని చాలా మంది అనుకున్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పట్లో బాబు మోహన్ పక్కన డ్యాన్స్ వెయ్యడానికి సౌందర్య అప్పటి వరకు కమిట్ అయిన రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ గా మరో పది లక్షల రూపాయిలను డిమాండ్ చేసిందట. నిర్మాత అచ్చి రెడ్డి మారు మాట్లాడకుండా ఇచ్చాడట. అప్పట్లో ఒక చిన్న సినిమాకి అయ్యే ఖర్చు సౌందర్య రెమ్యూనరేషన్ కోసం అయ్యిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus