ప్రతి ఏడాది వివిధ రంగాల్లో ప్రముఖులు సంపాధించిన మొత్తాన్ని బట్టి జాబితాని ప్రకటించడం ఫోర్బ్స్ కి అలవాటు. ఈ సంవత్సరం కూడా ఆ జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది. దేశంలోని సినీ రంగాల్లో ఉన్నవారు సంపాదన బట్టి స్థానాలను వెల్లడించింది. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ టాప్-100లిస్ట్ లో ఏకంగా 15స్థానంలో రాజమౌళి నిలిచి హీరోలను ఆశ్చర్యపరిచారు. 2017లో రాజమౌళికి 55కోట్లు ఆదాయం వచ్చినట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. రాజమౌళి తర్వాత స్థానంలో (సౌత్ పరిశ్రమ నుంచి చూస్తే ) ప్రభాస్ నిలిచారు. టాప్-100లిస్ట్ లో 36.25 కోట్ల ఆదాయంతో 22వ ప్లేస్ లో ఉన్నారు. ఆ తర్వాత సూర్య (25 ) , విజయ్ (31 ), రానా (36 ), మహేష్ (37 ), పవన్ (69 ) ఉన్నారు. సౌత్ సినీ సెలబ్రిటీస్ జాబితాలో అందరికంటే చివరి స్థానంలో అల్లు అర్జున్ ఉన్నారు. ఫోర్బ్స్ టాప్-100లిస్ట్ లో ఉన్న దక్షిణాది సినీ సెలబ్రిటీలు…
పేరు – స్థానం – ఆదాయం
రాజమౌళి – 15 – 55 కోట్లు
ప్రభాస్ – 22 – 36.25 కోట్లు
సూర్య – 25 – 34 కోట్లు
విజయ్ – 31 – 29 కోట్లు
రానా – 36 – 22 కోట్లు
మహేష్ – 37 – 19.63 కోట్లు
పవన్ – 69 – 11.33 కోట్లు
మోహన్ లాల్ – 73 – 11.03 కోట్లు
అల్లు అర్జున్ – 81 – 7. 74 కోట్లు