నేనేమీ పతివ్రతను కాదు.. ఫుల్లుగా తాగుతా.. ‘జబర్దస్త్’ బ్యూటీ బోల్డ్ కామెంట్స్ వైరల్!

‘జబర్దస్త్’ కమెడియన్ వర్ష ‘కిస్సిక్ టాక్ షో’ ని హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న ఆర్టిస్టులు గెస్టులుగా హాజరవుతున్నారు. ఇందులో భాగంగా వాళ్ళ లైఫ్ స్ట్రగుల్, పర్సనల్ వ్యవహారాల గురించి హోస్ట్ వర్ష ఆరా తీయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు చెప్పే సమాధానాలు కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఈ షోకి ‘జబర్దస్త్’ యాంకర్ సౌమ్య రావు గెస్ట్ గా వచ్చింది. ఆమెను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు వర్ష అడగడం జరిగింది.

Sowmya Rao

ఈ క్రమంలో ‘పార్టీల్లో ఏమైనా వైన్ వంటివి తీసుకునే అలవాటు ఉందా?’ అంటూ సౌమ్య రావుకి ఓ ఫన్నీ క్వశ్చన్ విసిరింది యాంకర్ వర్ష. అందుకు సౌమ్య.. “అందులో దాచుకోవడానికి ఏముంది.?అప్పుడప్పుడు వైన్ తీసుకుంటాను.నా మైండ్ ఫ్రెష్‌గా అవుతుందని వైన్ తీసుకుంటాను. ఒకవేళ ఫ్రెండ్స్‌తో పార్టీలకి వెళ్తే ఒకటి ,రెండు పెగ్స్ రెడ్ వైన్ కచ్చితంగా తీసుకుంటాను. ఇందులో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. నేనేం పతివ్రతను కాదు.

తాగను అని ఫేక్‌గా ఎందుకు చెప్పడం? నేను చేసేది ఓపెన్ గానే చెబుతాను’ అంటూ బోల్డ్ గానే చెప్పుకొచ్చింది ఈ యాంకరమ్మ. అలాగే తాగిన తర్వాత ఆమె మైండ్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి అనే విషయంపై కూడా ఈమె ఓపెన్ గానే చెప్పుకొచ్చింది. “నేను వైన్ తీసుకున్నప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆలోచనలే ఎక్కువగా వస్తాయి. డైరెక్టర్లు,నిర్మాతలు మనతో ప్రవర్తించిన తీరు.. వాటి గురించి మిగిలిన చూడటం.. వంటివి గుర్తుకొస్తాయి. మన మాట్లాడే తీరు పార్టీలో ఉండే జనాలకు ఇబ్బందిగా అనిపించొచ్చు కూడా..! అందుకే నేను పార్టీలకు వెళ్లడం కూడా మానేశాను” అంటూ చెప్పుకొచ్చింది.

 ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus