తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నిత్యం ఏదో ఒక కొత్త ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. దీంతో కన్సిస్టెంట్ గా హిట్లు కొడుతుంటారు ధనుష్. అంతేకాదు ధనుష్ కి ఆల్ రౌండర్ అనే బిరుదు కూడా ఉంది. హీరోగానే కాకుండా నిర్మాతగా, సింగర్ గా, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా కూడా సత్తా చాటారు ధనుష్.దర్శకుడిగా ‘పా పాండి’, ‘రాయన్’ ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ వంటి సినిమాలు తెరకెక్కించి హిట్లు కొట్టిన ధనుష్ ఇప్పుడు 4వ ప్రయత్నంగా ‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) చేశారు.
గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందింది. తెలుగులో రామారావు చింతలపల్లి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం | 1.0 cr |
సీడెడ్ | 0.20 cr |
ఉత్తరాంధ్ర | 0.80 cr |
ఈస్ట్ | 2 cr |
‘ఇడ్లీ కొట్టు’ (Idli Kottu) చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘ధనుష్’ గత చిత్రాలు అయిన ‘కుబేర’ ‘రాయన్’ వంటివి తెలుగులో కూడా బాగా ఆడాయి. కాకపోతే ఈసారి పవన్ కళ్యాణ్ ‘ఓజి’, రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ సినిమాలు పోటీగా ఉన్నాయి. మరి వాటి పోటీని తట్టుకుని ‘ఇడ్లీ కొట్టు’ టార్గెట్ ను రీచ్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.