Balakrishna: బాలయ్య ఫ్యాన్స్ కు ఇది నిజంగా శుభవార్తే!

స్టార్ హీరో బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నటించి అభిమానులకు నచ్చిన సినిమాలలో చెన్నకేశవరెడ్డి ఒకటి. బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన ఈ సినిమా కథ, కథనంలోని చిన్నచిన్న లోపాల వల్ల యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. వి.వి.వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. భరత్, చెన్నకేశవరెడ్డి పాత్రలలో నటించి బాలకృష్ణ ప్రేక్షకులను మెప్పించారు. 2002 సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన చెన్నకేశవరెడ్డి సినిమా విడుదలైంది.

ఈ సినిమా రిలీజై 19 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లోని దేవి థియేటర్ లో రాత్రి 9 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ కూడా ఈ స్పెషల్ షోకు గెస్ట్ గా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చెన్నకేశవరెడ్డి సినిమా రిజల్ట్ వల్ల వినాయక్ హర్ట్ అయినా బాలకృష్ణ మాత్రం వినాయక్ తో మళ్లీ కలిసి మరో సినిమా చేద్దామని చెప్పారు. టబు, శ్రియ శరన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమాలో పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాక్షన్ సినిమాలను ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లిందని బాలయ్య అభిమానులు భావిస్తారు. బీ, సీ సెంటర్లలో ఈ సినిమా బాగా ఆడింది. ఈ సినిమా ద్వారా నిర్మాతకు కూడా బాగానే లాభాలు మిగిలాయని సమాచారం. ఈ సినిమా తర్వాత బాలయ్య వినాయక్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus