SPY Twitter Review: ‘స్పై’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

‘కార్తికేయ 2’ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత నిఖిల్ నుండీ వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘స్పై’. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని చ‌ర‌ణ్ తేజ్ ఉప్ప లపాటి సీఈఓగా ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై కె రాజ శేఖ‌ర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై అంచనాలు పెరిగాయి.

జూన్ 29న (SPY Movie) ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే సూపర్ అని అంతా అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ యాక్షన్ ఎలిమెంట్స్, ట్విస్ట్ లు వంటివి అందరినీ థ్రిల్ చేస్తాయని తెలుస్తుంది.

నిఖిల్ టెరిఫిక్ పెర్ఫార్మన్స్, ఐశ్వర్య మీనన్ పాత్ర ద్వారా వచ్చే ట్విస్ట్ లు అభినవ్ గోమటం కామెడీ .. అన్నీ కూడా సినిమాని ఎంగేజ్ చేశాయని అంటున్నారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో .. యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇదని.. రానా పాత్ర కూడా అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఇక్కడ నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus