రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్న స్పైడర్!

  • September 23, 2017 / 12:10 PM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ ఈనెల 27 న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ వందకోట్లతో నిర్మించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు కలుపుకొని 156 .4 కోట్ల బిజినెస్ చేసి ఔరా అనిపించింది. కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే 121.4  కోట్లు పలికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 69 .6 కోట్లకు థియేటర్ హక్కులు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. అంతేకాదు టీజర్, ట్రైలర్ రూపంలో కూడా రికార్డులు సృష్టించింది.

తాజాగా ఈ సినిమా మరో రికార్డ్ ని బ్రేక్ చేసింది. స్పైడర్ ఫస్ట్ డే  టికెట్స్ ఆన్ లైన్లో ఓపెన్ చేసిన వెంటనే అమ్ముడు పోయి ఆశ్చర్య పరిచింది. ఈ లెక్కన స్పైడర్ పై ఎంత క్రేజ్ ఉందో అర్ధమవుతోంది. స్పైడర్ సినిమాతో మహేష్ బాబు ఒకే సారి తెలుగు, తమిళ రికార్డ్స్ తిరగరాస్తాడని  సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus