కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ షూటింగ్ పూర్తిచేసుకొని, వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. చెన్నైలో ఆడియో వేడుక నిర్వహించేందుకు చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని తెలిసింది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు స్పైడర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు కలుపుకొని 156 .4 కోట్ల బిజినెస్ చేసి మహేష్ సత్తాని చాటింది. కేవలం థియేటర్ రైట్స్ మాత్రమే 121.4 కోట్లు పలికింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో 69 .6 కోట్లకు థియేటర్ హక్కులు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఓవర్ సీస్ రైట్స్ 23 కోట్లకు పోటీపడి అక్కడి డిస్టిబ్యూటర్స్ సొంతం చేసుకున్నారు. శాటిలైట్ రైట్స్ అన్ని భాషలు కలుపుకొని 33 కోట్లకు ఓ ఛానల్ దక్కించుకుంది. ఆడియో రైట్స్ కూడా బాగానే పలికింది. రెండు భాషల్లో ఆడియో కోసం 2 కోట్లు చెల్లించారు.
ఏరియాల వారీగా థియేటర్స్ రైట్స్ …
వెస్ట్ గోదావరి – 5.04 కోట్ల
ఈస్ట్ గోదావరి – 6 కోట్ల
గుంటూరు – 7.2 కోట్ల
కృష్ణ – 5.4 కోట్ల
ఉత్తరాంధ్ర – 8.1 కోట్ల
నెల్లూరు – 2.9 కోట్ల
తమిళనాడు – 17 కోట్ల
కర్ణాటక – 10.80 కోట్ల
ఉత్తర భారత దేశం – 1 కోటి
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.