మహేష్ ని వెంటాడుతున్న స్పైడర్ మూవీ

Ad not loaded.

మనం కొన్నింటిని వదిలేసినా.. అవి మనల్ని వదలవు. ఇప్పుడు మహేష్ ని స్పైడర్ వదలడం లేదు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ వరుసగా విజయాలను సాధిస్తున్నారు. అతని కథలు, సినిమాలు బాషా బేధం లేకుండా అన్నిచోట్లా విజయం సాధిస్తున్నాయి. అందుకే బ్రహోత్సవం తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ డైరక్టర్ కి మహేష్ ఒకే చెప్పారు. కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించారు. ఏడాది పాటు కష్టపడ్డారు. కానీ ఫలితం ఒక్కరోజులోనే తేలిపోయింది. ప్రేక్షకులను ఏ కోణంలోనూ ఆకర్షించలేకపోయింది. స్పైడర్ ఇచ్చిన షాక్ తో కొన్ని రోజులపాటు విదేశాలకు వెళ్లి సేదతీరారు. ఆ అపజయాన్ని మరిచిపోయి కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మూవీ షెడ్యూల్ గ్యాప్ లో థమ్స్ అప్ యాడ్ చేశారు.

ఈ యాడ్ ని మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేశారు. ఈ విషయంలోనూ మహేష్ అంచనా తలకిందులైంది. సూపర్ గా ఉన్న యాడ్ ప్రశంసల జల్లు కురుస్తుందనుకుంటే… స్పైడర్ సినిమాని ఈ యాడ్ కి యాడ్ చేస్తున్నారు. స్పైడర్ సినిమా కన్నా ఈ యాడ్ చాలా బాగుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. రెండున్నర గంటల పాటు ఆ సినిమా టార్చర్ ని భరించడం కంటే హాయిగా ఈ రెండూ నిమిషాల యాడ్ ని చూడటం మంచిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రకటనకు “టేక్ చార్జ్” అని కాప్షన్ పెట్టగా, నెటిజన్లు ఏకంగా కమాన్ మహేష్ టేక్ చార్జ్ అంటూ కామెడీ గా ట్రోల్ చేస్తున్నారు. దీంతో మహేష్ ఏమి చేయాలో తెలియక తలపట్టుకు కూర్చున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus