కమర్షియల్ సినిమా అంటే అందులో హీరో సిగరెట్ తాగే సీన్, విలన్లు మందు తాగే సీన్ తప్పనిసరిగా ఉంటాయి. దాన్ని చూసి ప్రేక్షకులు చెడు అలవాట్లు చేసుకుంటారని సెన్సార్ బోర్డు వాళ్లు ఆ సన్నివేశాలప్పుడు “పొగతాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం” అని హెచ్చరికలు జారీ చేసేవారు. అంతేకాదు సినిమా ప్రారంభంలో స్మోకింగ్, డ్రింకింక్ కి సంబందించిన షో రీల్ ప్రదర్శించమని ఆర్డర్స్ వేసేవారు. అయితే మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలో హీరో అసలు సిగెరెట్ ముట్టడంట. నెగిటివ్ పాత్ర దారులు కూడా ఎక్కడా మందు తాగరని తెలిసింది.
కనీసం మద్యం బాటిల్స్ కూడా కనిపించకుండా డైరక్టర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. అందుకే చిత్ర బృందం సెన్సార్ బోర్డు ని ఓ రిక్వెస్ట్ కోరుతోంది. తమ సినిమాకు స్టాట్యుటరీ వార్నింగ్ వీడియో లేకుండా ప్లే చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని అడుగుతోంది. దీనికి సెన్సార్ బోర్డ్ నిర్ణయం రెండు రోజుల్లో తెలియనుంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న స్పైడర్ లో స్మోకింగ్ డ్రింకింగ్ సీన్లు లేకపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో స్పైడర్ ట్రెండ్ సృష్టించిందని అంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.