Jamuna: సీనియర్ నటి జమున సంచలన వ్యాఖ్యలు!

తెలుగు వారికి శ్రీ కృష్ణుడు అంటే నందమూరి తారకరామారావు ఎలా గుర్తుకు వస్తారో సత్యభామ అంటే జమున కళ్ళముందు కదలాడుతారు. అంతలా నటించి మెప్పించారు. పౌరాణికమే కాదు మిస్సమ్మ వంటి సాంఘిక చిత్రాల్లోనూ అద్భుతంగా నటించి టాలీవుడ్ ఉత్తమ కథానాయికల్లో ఒకరిగా పేరు దక్కించుకున్నారు. ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనని అప్పటి స్టార్ హీరోల్లో ఇద్దరు పక్కన పెట్టారని చెప్పారు. “మొదటి నుంచి నేను కథ బాగుందా లేదా? .. నా పాత్ర బాగుందా లేదా? అనే చూసేదానిని. ఇక హీరో ఎవరనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు.

అంతేకాకుండా నాకు ఆ హీరోనే కావాలని అడగను. అలా డైరక్టర్ ఇష్టం ప్రకారమే ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, హరనాథ్, జగ్గయ్య లతో నటిస్తూ వస్తున్నాను. ఒక స్టేజ్ లో ఇద్దరు హీరోలు నన్ను పక్కన పెట్టారు. అందుకు కారణం ఉంది. ఆ ప్రముఖ హీరోల్లో ఒక హీరో .. “మన కాంబినేషన్ బాగుంటుందని దర్శకులకు చెప్పాలి గదా .. నీ ఇష్టం వచ్చిన వాళ్లతో చేసేస్తావు. నాతో చేస్తాను అని ఎందుకు చెప్పవు” అని   అడిగారు. అప్పుడు నేను “నాకు అలవాటు లేదండి .. దర్శక నిర్మాతలు సెలెక్ట్ చేసుకుంటారు” అన్నాను.

అప్పటి నుంచి అతనితో పాటు మరో హీరో నాతో సినిమాలు చేయడం ఆపేసారు. ఆ హీరోలు నన్ను పక్కన పెట్టేసినా నేను ప్రాధేయపడలేదు” అని ఆనాటి సంగతులను వివరించారు. ప్రస్తుతం సావిత్రి బయోపిక్ లో జమున రోల్ ని సమంత పోషిస్తోంది. అందులో ఈ విషయాన్నీ ప్రస్తావిస్తారో లేదో చూడాలి.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus