SR Kalyanamandapam: ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్..!

శ్రీధర్ గాదే దర్శకత్వంలో ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’. సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ‘ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మించారు.దర్శకుడు శ్రీధర్ గాదెకి ఇదే మొదటి చిత్రం. అయినప్పటికీ టీజర్, ట్రైలర్లలో ఆ విషయాన్ని తెలీనివ్వలేదు.అంత బాగా ఇతను మూవీని తెరకెక్కించినట్టు స్పష్టమవుతుంది.ఇక చేతన్ భరద్వాజ్ సంగీతంలో రూపొందిన పాటలకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆగష్ట్ 6న విడుదలయ్యే ఈ చిత్రం పై మంచి అంచనాలే నెలకొన్నాయి.

మరి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  1.28 cr
సీడెడ్  1.08 cr
వైజాగ్  0.72 cr
ఆంధ్రా(రెస్ట్)  1.27 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  4.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +ఓవర్సీస్  0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్  4.55 cr

 

‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రానికి రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.4.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. టీజర్, ట్రైలర్ వంటి అయితే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో సినిమా పై క్రేజ్ ఏర్పడింది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి..!

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus