Sree Leela: శ్రీలీల.. ఎక్కడ తేడా కొడుతోంది?

టాలెంట్‌, గ్లామర్‌, అద్భుతమైన డాన్స్.. అన్నింటికీ మించి ‘తెలుగు అమ్మాయి’. శ్రీలీలకు ఈ మధ్య కాలంలో ఏ యంగ్ హీరోయిన్‌కూ రాని ‘రేర్ క్రేజ్’ దక్కింది. ఆమె స్క్రీన్‌పై కనిపిస్తే చాలు, సినిమా హిట్టా ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఫిదా అయ్యారు. కానీ, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని శ్రీలీల దారుణంగా వృధా చేసుకున్నట్లు కనిపిస్తోంది.

Sree Leela

ఆమె స్క్రిప్ట్ సెలక్షన్ ఇప్పుడు ఆమె కెరీర్‌కే మైనస్‌గా మారింది. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘గుంటూరు కారం’, ‘రాబిన్‌హుడ్’.. ఇలా వరుస ఫ్లాపులు ఆమె గ్రాఫ్‌ను దారుణంగా కిందకు లాగాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా రవితేజతో చేసిన ‘మాస్ జాతర’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమై, ఆమె ఫ్లాపుల లిస్ట్‌లో చేరిపోయింది.

ఫ్లాపులు ఒకవైపు అయితే, ఆమె కొత్త ‘స్లిమ్’ లుక్ మరోవైపు దెబ్బకొడుతోంది. ఈ కొత్త లుక్ కోసం చాలా కఠినమైన డైట్ ఫాలో అవుతున్నానని ఆమె ప్రమోషన్లలో చెప్పినా, ఈ లుక్ ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు. “శ్రీలీల తన సహజమైన చార్మ్, గ్రేస్ కోల్పోతోంది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇండస్ట్రీలో మరో గాసిప్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆమె ప్రాజెక్టుల ఎంపికలో వాళ్ల తల్లి ప్రమేయం ఎక్కువైందని, బాలీవుడ్ కోసం ఆమెను సన్నగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఈ బాలీవుడ్ ఎంట్రీ కోసమే శ్రీలీల ఇలా సడెన్‌గా తన లుక్ మార్చిందన్న టాక్ కూడా వస్తోంది.

కారణాలు ఏవైనా, శ్రీలీల ఇప్పుడు డేంజర్ జోన్‌లో ఉంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్లాంటి పెద్ద సినిమా చేతిలో ఉన్నా, ఇప్పటికైనా స్క్రిప్ట్ ఎంపికలో జాగ్రత్త పడకపోతే, ఇంత వేగంగా వచ్చిన క్రేజ్, అంతే వేగంగా కనుమరుగవడం ఖాయం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus