బుల్లి తెరపై దూసుకుపోతున్న గ్లామరస్ యాంకర్స్ లో బొద్దుగుమ్మ శ్రీముఖి ఒకరు. పటాస్ వంటి కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 3 కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి రచ్చ చేసింది. టైటిల్ కోసం గట్టిగా పోరాడిన ఈ అమ్మడు ఫైనల్ లో రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ఓడిపోయింది. కాగా ఈ అమ్మడు హీరోయిన్ గా ఎదగాల్సి ఉండగా కొన్ని కారణాల వలన హీరోయిన్ అయ్యే ఛాన్స్ వదులుకుందట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీముఖి తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన చాల విషయాలు బయటపెట్టింది. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీలో కి వచ్చిన శ్రీముఖికి ఓ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. ఐతే ఆ సినిమాలో కొంచెం పొట్టి బట్టలు ధరించి హాట్ గా కనిపించాలని చెప్పడంతో పాటు, లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని కూడా చెప్పారట.
అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేని శ్రీముఖి ఆ సినిమా వదులుకుందట. అలాగే వాళ్ళ నాన్న కూడా శ్రీముఖికి అలాంటి సినిమాలు చేస్తే ఒప్పుకోనని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట. ఇక శ్రీముఖి జులాయి సినిమాలో ఓ చిన్న పాత్ర చేయగా, ఆ సమయంలో టీవీ యాంకర్ గా మారితే హీరోయిన్ కాలేవు అనే సలహా కూడా ఇచ్చారట. యాంకర్ రవితో ఎఫైర్ ఉందని ప్రచారమైన వార్తలు కూడా బాధించాయని శ్రీముఖి చెప్పింది.