‘బిగ్ బాస్ సీజన్ 3’ లో బీభత్సమైన ఫాలోయింగ్ కలిగిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే.. కచ్చితంగా శ్రీముఖి అనే చెప్పాలి. అయితే చివరికి ఈమె విన్నర్ మాత్రం కాలేదు. రన్నరప్ గా నిలిచింది. అయినప్పటికీ విన్నర్ కంటే డబుల్ పారితోషికం అందుకుంధనే టాక్ కూడా బలంగానే ఉంది. అవును కోటికి పైనే ఈమెకు పారితోషికం అందిందట. ఇక ఫైనల్ ముగిసిన వెంటనే.. మాల్దీవులకు చెక్కేసిన ఈ హాట్ యాంకర్.. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన శ్రీముఖి.. ‘బిగ్ బాస్’ హౌస్ లో చేసిన సీక్రెట్ పనుల గురించి చెప్పుకొచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. “లైట్లు వెలిగినంత సేపు హౌస్లో ఎవ్వరూ నిద్రపోకూడదన్న నిబంధన అందరికీ తెలిసిందే. అయితే కనుబొమ్మలు తీసే నెపంతో మేము నిద్రపోయే వాళ్ళం. నేను మరికొంత మంది లేడీ కంటెస్టెంట్ లు అలా చేసాం. అలా ‘బిగ్బాస్’ ను మోసం చేసాం. తరువాత మేల్ కంటెస్టెంట్ లు కూడా అలా చేయడం మొదలు పెట్టారు.” అంటూ అసలు మ్యాటర్ చెప్పేసింది శ్రీముఖి. పాపం.. ఈమె ఇలా చెప్పేసింది కాబట్టి ‘సీజన్ 4’ లో కంటెస్టెంట్ లు ఈ పని చేద్దాం అన్నా చేయలేరు.. కదా..!