Sree Mukhi: పెళ్లిపై యాంకర్ శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!

  • November 17, 2021 / 04:53 PM IST

స్టార్ యాంకర్ శ్రీముఖి యాంకర్ గా వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పలు రియాలిటీ షోలలో పాల్గొంటూ, సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు చేస్తూ శ్రీముఖి పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు. తాజాగా శ్రీముఖి తెలుగు ఓటీటీ ఆహాలో సర్కార్ అనే గేమ్ షోకు హాజరయ్యారు. ఈ షోకు ప్రదీప్ యాంకర్ గా వ్యవహరిస్తుండగా ప్రదీప్ శ్రీముఖిని ఎలాంటి అబ్బాయి కావాలని ప్రశ్నించారు.

ఆ ప్రశ్నకు శ్రీముఖి సమాధానం ఇస్తూ మంచి ఉద్యోగం చేసే వ్యక్తి తనకు కావాలని తెలిపారు. అందంగా ఉండే వ్యక్తిని తనకు వరుడిగా కోరుకుంటానని శ్రీముఖి చెప్పుకొచ్చారు. తనను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి డబ్బులు కూడా బాగా ఉండాలని శ్రీముఖి కామెంట్లు చేశారు. శ్రీముఖి కోరుకున్న లక్షణాలతో ఉన్న అబ్బాయి దొరుకుతాడో లేదో చూడాల్సి ఉంది. ఎంతో సందడిగా ఈ గేమ్ షో జరగగా ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ఈ షోలో 14 లక్షల 30 వేల రూపాయలు గెలుచుకున్నారు.

శ్రీముఖి, ప్రవీణ్ తో పాటు అలీ, మధు ఈ షోలో పాల్గొన్నారు. యాంకర్ ప్రదీప్ తనదైన శైలి యాంకరింగ్ తో ఈ షో సక్సెస్ కావడానికి తన వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు తక్కువ సంఖ్యలో షోలు చేస్తున్న శ్రీముఖి మళ్లీ బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus